విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తి పారవశ్యంతో ప్రజలు ఆదిదేవున్ని కొలుస్తున్నారు. ఐదవ రోజు సందర్భంగా పలు ప్రాంతాలలో నిర్వాహకులు వినాయక మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అరండల్ పేట, వెంకటేశ్వర నగర్, మధ్య కట్ట సహా పలు ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనతికాలంలో దేశంలోనే అనేక రంగాలలో ప్రథమ స్థానంలో నిలిచిందని మల్లాది విష్ణు అన్నారు. సంక్షేమంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపు ఈ ప్రభుత్వంపై ఎల్లవేళలా ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న ఈ వినాయక ఉత్సవాలు.. అంతే ఆనందంతో ముగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ప్రధానంగా నిమజ్జన శోభాయాత్రలలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే నిమజ్జన కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వినాయక నిమజ్జనాలను పరిశీలించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …