Breaking News

పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాల నివారణ : ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాలను నివారించవచ్చని ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి. అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం పోషకాహార మాసోత్సవాలను ఆమె జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉమారాణి మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని నివారించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాక వారికి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆరోగ్య భారతం సాధ్యమవుతుందన్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పూర్తి స్థాయి పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించి వారిలో రక్తహీనత లేకుండా చూస్తున్నామన్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడి వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి తరచూ వ్యాధుల బారిన పడుతూ ఉంటారన్నారు. ఏ ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే పౌష్టికాహారం లభిస్తుందో ప్రజలకు అవగాహనా కలిగించడంతోపాటు పౌష్టికాహార లోపంతో కలిగే నష్టాలను కూడా తెలియజేయడం “పోషకాహార మాసోత్సవాల ” ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రతీ వ్యక్తి గుడ్లు, పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు తరచూ తీసుకోవాలన్నారు.
సిడిపిఓ వై. జయలక్ష్మి మాట్లాడుతూ నూజివీడు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో మహిళలు, గర్భిణీలు, బాలింతలకు ప్రతీ రోజు పౌష్టికాహారం అందిస్తున్నామని, , పిల్లలకు బాలమృతాన్ని అందిస్తున్నామన్నారు. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామని, గర్భిణీలకు వాక్సినేషన్ పై కూడా అవగాహన కలిగిస్తున్నామన్నారు. అనంతరం చంటి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్ల పి .డి. ఉమారాణి అందజేశారు. అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు పి హెచ్ సి వైద్యులు డా. కీర్తి, మెప్మా టి.ఎం.సి నాగాజి రావు, నూజివీడు సర్కిల్ పరిధిలోని అంగన్వాడీ సూపెర్వైజర్లు, టీచర్లు, వర్కర్లు, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *