విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ బుధవారం కలిశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు అందచేశారు. అక్టోబర్ 07 నుంచి 15 వరకు ఆలయంలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా కోరారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ కి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.