విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యు.ఎస్.ఎ లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అరసవిల్లి అరవింద్ అన్నారు. మంగళవారం “యుఎస్ఎ లో ఉన్నత విద్య” అనే అంశంపై ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆవరణలో సెమినార్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, యుఎస్ఎలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని మరియు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాయని అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు యుఎస్ఎలో ఉన్నత విద్యకు మంచి అవకాశం ఉందని, 2 సంవత్సరాల కోర్సు పూర్తయిన తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. అమెరికా లో చదువుకోవాలంటే 3 రకాల వీసాలలో ఏదైనా ఒకటి అవసరమని, అవి F1 స్టూడెంట్ వీసా, J1 ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసా మరియు M-1 వొకేషనల్/ అకాడెమిక్ స్టూడెంట్ వీసా, అని అరవింద్ తెలియజేశారు. మేము ఫాల్ ఇన్టేక్ కు 98% వీసా సక్సెస్ రేట్ తో అద్భుత ఘనతను సాధించాము మరియు రాబోయే స్ప్రింగ్ ఇన్టేక్ కి 100 శాతం సక్సెస్ రేట్ సాధిస్తాం అన్న నమ్మకం ఉంది, అని ఎక్సెల్లా మేనేజింగ్ డైరెక్టర్ గర్వంగా తెలియజేసారు. అమెరికా విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి ఇష్టపడే విద్యార్థులు మా వెబ్సైట్ www.exellaedu.com ని సందర్శించవచ్చు లేదా 9888196666 కు కాల్ చేయవచ్చు, అని అరవింద్ అరసవిల్లి అన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …