-నిబందనల అతిక్రమించిన యెడల చర్యలు తప్పవు
-నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 తేదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ దినముగా ప్రకటించి సెలవు మంజూరు చేయడం జరిగింది. గాంధీ జయంతి రోజు నగరపాలక సంస్థ కబేళా సెలవు ప్రకటించుట జరిగిందని నగర కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలియజేసినారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని చికెన్, మటన్ మరియు చేపల మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించడమైనది. నగరపాలక సంస్థ నిబందనల ప్రకారం ఎవరు కూడా ఏవిధమైన నాన్ వెజ్ మరియు చేపల విక్రయాలు అమ్మకూడదని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆదేశాలను పాటించకుండా ఎవరైనా నగరంలో మాంసపు విక్రయాలు సాగించిన యెడల అట్టి వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని, నిబందనలను ఉల్లఘించిన యెడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తిసుకోనుటతో పాటుగా వారి షాప్ లైసెన్స్ రద్దు పరచుట జరుగుతుందని హెచ్చరించారు.