-ప్రతినెలా ఒకటవ తేదిన గుర్తు వచ్చేది వైఎస్సార్ పెన్షన్ కానుక …
-ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పట్టణం లోని 4వ వార్డు లో నూతనంగా అమలు అయిన వృద్ధాప్య మరియు వికలాంగ పెన్షన్లు లను స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మున్సిపల్ ఛైర్మన్ అందచేశారు. ఈ సందర్భంగాశ్రీమతి బావన రత్నకుమారి మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వం అన్నారు. ప్రతి నెలా ఒకటోవ తారీఖున వృద్ధులు, దివ్యంగులు , తదితరులకు ఇంటి వద్దనే వాలంటీర్లు సామాజిక భద్రత పింఛన్ సొమ్ము అందించడం జరుగుతోందన్నారు. కొత్తగా ఈ నెల సుమారు రెండు వందల మందికి సామజిక భద్రత పింఛన్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. మునిసిపల్ కమిషనర్ కె.టి.సుధాకర్ మాట్లాడుతూ, కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో సుమారు 3,700 మందికి పెన్షన్లు అందించడం జరుగుతున్న ట్లు తెలిపారు. 23 వార్డుల పరిధిలో 3500 మంది ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకుంటున్నారని, మరో 200 మందికి ఈ నెల నుండి పింఛన్లను కొత్తగా మంజురూ చేసి అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయానికే 75 శాతం మంది కి పింఛన్లను పంపిణీ చేశామని, మిగిలిన లక్ష్యాలను సాయంత్రం కి పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలను జరిచేశామన్నారు. ఐదో వార్డుకి చెందిన యలమాటి ధనలక్ష్మి, ఈదల లీలావతి లకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగా తమకు ఇంటివద్దనే పింఛన్లను అందచేస్తున్న జగనన్న కు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
యలమాటి ధనలక్ష్మి, ఈదల లీలావతి
కొవ్వూరు పురపాలక సంఘం వెల్ఫేర్ అధికారి అనిల్ కుమార్ పర్యవేక్షణలో 23 వార్డుల్లో తెల్లవారుజాము నుంచి వాలంటీర్లు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు.