విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో ఈ.ఎస్.ఐ హాస్పిటల్ ఎదురుగా భీమిశెట్టి సాంబశివరావు నూతన వ్యాపారం మిని షిప్ ఆంధ్ర
అవుట్లెట్లును దేవినేని అవినాష్ ప్రారంభించారు. అవినాష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కలిపించేందుకు ప్రభుత్వం కొత్తగా మినిషిప్ ఆంధ్ర అవుట్లెట్లును తీసుకొచ్చింది “మన చేప-మన ఆర్యోగ్యం”కింద ఈ పథకం శ్రీకారం చుట్టడం జరిగింది అని అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన చేపలు విక్రయంచేందుకు జగన్మోన్ రెడ్డి ఈ విన్నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అన్నారు. లబ్ధిదారుడు 30 వేలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్ము బ్యాంకులు అందజేస్తాయి అన్నారు. దింతో సొంతంగా అవుట్లెట్ వ్యాపారం చేసుకోవచ్చు అన్నారు. రానున్నరోజుల్లో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాలో పరిధి అందుబాటులో తేనున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళ్ళిక, కో-ఆప్షన్ మెంబెర్ ముసుబూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …