Breaking News

పేదల ఆరోగ్యానికి పెద్దపీట… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 3.19 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి  వైద్య‌ రంగానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 3 లక్షల 19 వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించ‌డంలో భాగంగా ఆధునిక‌ వైద్య మౌళిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నార‌న్నారు. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 755 మందికి రూ. 3 కోట్ల 54 లక్షల 86 వేల 35 రూపాయల చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతోందని మల్లాది విష్ణు  తెలిపారు. ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేసి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా.. నాడు-నేడు కార్యక్రమాన్ని శ్రీ‌కారం చుట్టడం జరిగిందన్నారు. గ‌తంలో ఏ ప్రభుత్వాలు చేయ‌ని విధంగా.. సీఎం వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి  రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, చిన్న పిల్లలకు సంబంధించిన ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ.. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలవ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  కృషి మరువలేనిదన్నారు. ఆరోగ్యశ్రీని విస్తృతం చేయడం ద్వారా పేద ప్రజలకు వైద్యాన్ని మ‌రింత‌ చేరువ చేశార‌ని చెప్పుకొచ్చారు. 2,434 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తుండ‌టంతో పాటు.. ఇతర రాష్ట్రాలలోని ఆసుప‌త్రుల‌కు కూడా ఆరోగ్యశ్రీ పథ‌కం అందేలా జగన్‌  నిర్ణయించడం ద్వారా ఎంతో మందికి మేలు చేకూరింద‌న్నారు. చివరకు కరోనాను కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రులకు బకాయిలను సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొండాయిగుంట మల్లేశ్వరి, యర్రగొర్ల తిరుపతమ్మ, అలంపూర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *