సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది…

పొలమూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పొలమూరు , మాముడూరు సంబంధించి పొలమూరు హైస్కూల్ గ్రౌండ్ నందు గ్రామ సభలో లబ్ధిదారులకు వైఎస్సార్ ఆసరా చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు , జిల్లా పరిషత్ చైర్మన్ కె. శ్రీనివాస్ లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ ను మంత్రి శ్రీరంగనాధ రాజు తదితరులు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, ముఖ్యమంత్రి పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని, పశ్చిమగోదావరి జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండి నడిపించాలని సూచించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో సుస్థిరమయిన స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాదించుకున్నారని, ఆయన స్పూర్తితో ముందడుగు వేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *