Breaking News

ప్రజారవాణా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు అందించుటతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తాం…

-రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని),
-వైస్ ఛైర్మన్ యంసి. విజయానంద రెడ్డి

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచి లాభాల బాటలో నడిపించేలా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.
ఏపియస్ఆర్ టి సి వైస్ ఛైర్మన్ గా సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సికె కన్వెన్షన్ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యంసి. విజయానంద రెడ్డి వైస్ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ గ్రామ గ్రామాన ప్రజారవాణా వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తుందని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేలా రవాణా వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పడిన ఏపియస్ఆర్ టిసి పాలకవర్గం ఈదిశగా కృషి చేయాలని మంత్రి అన్నారు. ఆర్ టి సి వైస్ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన విజయానంద రెడ్డిని మంత్రి అభినందిస్తూ ఆర్ టెసి ఛైర్మన్ తో కలిసి ఆర్ టెసి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు. మనిషిని ప్రేమిస్తే ఎ ంతదూరమైనా వస్తారనేదానికి చిత్తూరు నుంచి వచ్చిన ప్రజలే సాక్ష్యమని మంత్రి అన్నారు. కష్టపడి పనిచేసే నాయకులను కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే దానికి విజయానంద రెడ్డికి వరించిన పదవే ఉదాహరణ అని మంత్రి పేర్ని నాని అన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలే ఈ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని అన్నారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత ప్రగతిపథంలో నడిపించగల సమర్ధవంతమైన నాయకులు విజయానంద రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అభినందించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజారవాణా వ్యవస్థను నష్టాల ఊబిలో నుండి లాభాలబాటలో నడిపించేలా ఈ ప్రభుత్వం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నదని అన్నారు. ఏపియస్ఆర్ టి సిని మరింత బలో పేతం చేసి సమర్ధ వంతంగా నడిపించగల నాయకుడు విజయానంద రెడ్డి అని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, శాతావాహనా ఆర్ టిసి రీజియన్ ఛైర్మన్ తాతినేని పద్మావతి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *