విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, అధ్యక్షతన “రిసోర్స్ మొబైలైజేషన్” పై నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశానికి హాజరైన జాయింట్ కలెక్టర్ మాధవిలత. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్, వినీత్ బ్రిజ్ లాల్ ల అధ్యక్షతన “రిసోర్స్ మొబలైజేషన్” పై నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రధానంగా అక్రమ మద్యం రవాణా, నాటుసారాయి నిర్మూలన, ఎన్ఫోర్స్మెంట్, తదితర అంశాల అజెండాగా జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల కల్లెక్టర్లు, ఎస్పీల నుండి జిల్లాల వారీగా గత వారం రోజుల కాల వ్యవధిలో చేసిన మద్యం, నాటుసార విక్రయాలు, తయారీ పై చేసిన చట్టపర చర్యల వివరాలు తెలుసుకోవడం జరిగింది. మెరుగైన పనితీరు ద్వారా ఎక్సైజ్,అమ్మకపు పన్నుల ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలని ,అక్రమ మద్యం రవాణా నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సంబంధింత అధికారులకు సూచించారు. సోమవారం ఎక్సైజ్,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫెరెన్సు లో స్థానిక జేసీ క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్సైజ్ మద్యం అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రా మద్యం, నాటు సారాలను రాష్ట్రంలో కి రాకుండా అరికట్టి ఆదాయ వనరులు అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
విసి అనంతరం జేసీ మాధవిలత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్సైజ్ మరియు అమ్మకపు పన్నుల ఆదాయాన్ని పెంచి ఆర్థిక వనరులను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్సైజ్ మరియు అమ్మకపు పన్నులు ద్వారా ఆర్థిక వనరులు అభివృద్ధిపై చేపట్టే పనుల పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇతర రాష్ట్రల నుంచి అక్రమంగా మద్యం , నాటుసారా సరఫరా కాకుండా అరికట్టి వనరుల అభివృద్ధికి సహకరించాలని ఎక్సైజ్ అధికారులను సూచించారు. అలాగే వనరులను అభివృద్ధి చేయుటకు జి ఎస్టీ టాక్స్ పరిధి లోకి అసంఘటిత పరిధి లో ఉన్నవారిని టాక్స్ వలయం లోనికి తీసుకొనిరావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదే విధంగా వృత్తి పన్ను అభివృద్ధి కి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాల వద్ద, చెక్ పోస్ట్ కేంద్రాల వద్ద తనిఖీలను మరింత ఉధృతం చేయాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి. సౌరి, సీఐ లు వై.వైకుంఠ రావు, జె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News