నిర్ణీత సమయంలోపే ఆర్జీలు వరిష్కారించాలి…

-స్పందనకు 50 ఆర్జీలు రాక
-సబ్ కలెక్టర్ జి. ఎస్ఎస్ ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 50 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు.
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కరం చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సూచించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ (సిసిఎ) 22, పౌర సరఫరాలు 4, పోలీస్ 4, వియంసి 8, ఇతర అన్ని శాఖలకు సంబంధించి మరో 12 ఆర్జీలు కలిపి మొత్తం 50 ఆర్జీలు స్పందన ద్వారా అందాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో పే స్పందనలో వచ్చిన ఆర్జీలు పరిష్కారించాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. స్పందనలో అందిన వినతుల్లో కొన్నింటిని అక్కడికి అక్కడే సంబంధిత తహాశీల్దార్లకు, ఫోన్ చేసి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయవాడ ఇస్లాంపేటకు చెందిన అలీ ఆర్జీని ఇస్తూ చేపల మార్కెట్, సైయద్ గులాబ్ వీధి, హామీద్ వీధులకు సంబంధించి ప్రజలకు ఉపయోగ పడే రోడ్డు మార్గాన్ని అక్రమించి అక్రమకట్టడాలు చేస్తున్నారని చెప్పారు. దీనిపై సట్ కలెక్టర్ స్పందిస్తూ టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికార్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వియంసి అసిస్టెంట్ సిటీ ప్లానర్‌ను ఆదేశించారు.
విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడుకు చెందిన వేముల వెంకటేశ్వరరావు అర్జీని ఇస్తూ తన కుమారులు తనను ఇంటిలో ఉండనీయటం లేదని గతంలో తెలియజేయగా దీనిపై ఇంటిలో వుంచేందుకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారని అయితే ఇప్పుడు తన కుమారులు చూడాడం లేదని దీనిపై పోలీస్ అధికారులకు పిర్యాదు చేయగా వారు నా కుమారుల ఎదుటే నన్ను అవహేళన చేస్తున్నారని చెప్పారు. దీనిపై సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ స్పందిస్తూ ఈ విషయం పై తగు చర్యలు తీసుకోవాలని ఎసిపి వెస్టును కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *