Breaking News

ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గతంలో వివిధ గృహనిర్మాణాల పథకం కింద నిర్మించిన 2.8 లక్షల ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు.
స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం  సబ్ కలెక్టర్, ఆర్డీఓలు యంపిడివోలు, తహాశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఇంజనీర్లు తదితర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, తదితర అంశాలకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమీక్షించారు.
జిల్లాలో 1983 సంవత్సరం నుంచి 2005 వరకు వివిధ గృహనిర్మాణాల పథకం కింద పట్టణ, గ్రామీణ గృహనిర్మాణాలు నిర్మించారన్నారు. లబ్ధిదారులకు ఇంటిని రిజిస్టషన్ చేసి సంపూర్ణంగా ఇంటిపై హక్కును కల్పించాలనదే
ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఆ పథకాల కింద నిర్మించిన 2.8 లక్షల గృహల్లో 2.5 లక్షల గృహలు మాత్రమే వాలంటీర్లు, విఆర్‌ఓలు లబ్ధిదారులను గుర్తించారన్నారు. ఇంకా 30 వేల గృహలకు లబ్ధిదారులను గుర్తించలేదని చెప్పారు. ఆ గృహల్లో లబ్దిదారుడే నివాసం ఉన్నాడా? అతని వారసులు ఉన్నారా? ఇతరులకు విక్రయించి వెళ్లాడా? వంటి వివరాలతో పాటు ఇంటి సరిహద్దులను కూడా గుర్తించాలన్నారు. ప్రతీ గ్రామీణ లబ్ధిదారుడి నుంచి 10 వేల రూపాయలు, మున్సిపల్ పట్టణంలోని లబ్ధిదారులనుంచి రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులనుంచి 25 వేల రూపాయలు వసులు చేయాలన్నారు. తాను నివాసం ఉన్న ఇంటిపై పూర్తి హక్కు లబ్ధిదారుడికే లభించే ప్రయత్నమన్నారు. డిసెంబరు 21 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎప్పటికప్పుడు డేటాను డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేయించాలన్నారు. తహాశీల్దార్లు, యంపిడివోలు సంయుక్తంగా ఈ ప్రక్రియ సమీక్షించాలని ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వచ్చే వారం నాటికి ప్రతీ మండలంలో ఖచ్చితంగా 500 మందికి తగ్గకుండా నిర్మాణ సామాగ్రి లబ్దిదారులకు అందించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన స్టీల్, సిమెంట్, ఇసుక తదితర సామాగ్రి అందుబాటులో ఉన్నప్పుడే లబ్దిదారులకు అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నరని ఆయన ప్రశ్నించారు. ఇదే పని విధానం కనపరిచే అధికారులపై చర్యలు తప్పవన్నారు. స్థానిక ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సహకారం తీసుకుని ఇళ్ల నిర్మాణ సామాగ్రి అందించాలన్నారు. వచ్చే వారం ఈ అంశంపైనే గ్రామాలవారిగా సమీక్షిస్తామని అన్నారు.
జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల ఎంతో ఉపయోగం ఉందని పట్టాలు లబ్ధిదారుల చేతికే అందుతాయన్నారు. వారి ఇంటి స్థలం పై వారికి అన్ని రకాల హక్కులు వస్తాయన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, టిడ్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ చిన్నోడు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *