ధవళేశ్వరం.నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని తమకు తోచిన రీతిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని యం. రాజబాబు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారంనాడు ధవళేశ్వరం బైపాస్ రోడ్డులో గల శ్రీ శ్రీదేవి పోలేరమ్మ ఆలయం వద్ద సుమారు 1500 మందికి అన్నదానం కార్యక్రమంను ఆలయ ధర్మకర్త శ్రీమతి యం పార్వతమ్మ కుమారుడు యం రాజుబాబు నిర్వహించారు. రాజుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా జులై నెలలో నిర్వహించే పోలేరమ్మ జాతరతో పాటుగా విజయదశమి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. విజయదశమి వేడుకల్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమంను కూడా నిరాఘాటంగా నిర్వహించగలుగుతున్నామన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే దసరా వేడుకల్ని, అన్నదాన కార్యక్రమాన్నీ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి దర్శనంనకు విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదంలతో పాటుగా పసుపు కుంకుమ లను పంపిణీ చేశారు. అన్నదాన వితరణ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయం కమిటీ సభ్యులు, ఆలయ పూజారి సహకారంతో విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నామని ఆయన తెలిపారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …