విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులోని వడ్డెర సంఘం రాష్ట్ర ప్రతినిధుల మహాసభలో ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్, రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రభుత్వం వచ్చినా వడ్డెర్లకి వరిగినది ఏమిలేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎస్టీ, ఎస్సి సంభందించిన విషయములో ప్రధానమంత్రికి రాసిన లేఖలో వడ్డెర్లని ఎందుకు ప్రస్తావించలేదో వడ్డెర్లకి చెప్పాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వడ్డెర్ల కి ఇస్తానన్న ఎమ్మెల్సీ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని వడ్డెర్లకి ఎమ్మెల్సీ అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పుడు ఎమ్మెల్యే గా గెలిసిన వారికులాలకే ఎమ్మెల్సీ ఇస్తున్నారని వడ్డెర్లకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలేదో చెప్పాలని, కార్పొరేషన్ల్లో డైరెక్టర్ పదవులు తీసుకున్నవారు ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ ఇచ్చేవిధంగా వత్తిడి తీసుకురావాలని వడ్డెర్లని ఎస్టీ/ఎస్సీ లో చేర్చే విధంగా చర్యలు చేపట్టేవిధంగా కృషి చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News