-క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి – మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-స్పందనలో 21 అర్జీలు స్వీకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో నగరపాలక సంస్థ కు సంబందించి పలు సమస్యలపై ప్రజల నుండి 21 ఆర్జీలను స్వీకరించారు.
సమస్యలను అర్జీలు పరిశీలించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందులను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 1, ఇంజనీరింగ్ – 4, పట్టణ ప్రణాళిక – 4, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) – 1, పబ్లిక్ హెల్త్ – 7, యు.సి.డి విభాగం – 2, ఉద్యానవన విభాగం – 2 మొత్తం 21 అర్జీలు స్వీకరించుట జరిగింది.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్.ఇ (వర్క్స్) నరశింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నరు.
సర్కిల్ కార్యాలయాలలో 4 అర్జీలు స్వికరింసిన జోనల్ కమిషనర్లు…
జోనల్ కమిషనర్లు అద్వర్యంలో సర్కిల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 2 కార్యాలయంలో – ఇంజనీరింగ్ సంబందించి-2 అర్జీలు మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ -1, ఉద్యానవన శాఖ -1 అందించారు. సర్కిల్ – 1 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు వచ్చియుండలేదు.