Breaking News

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద చేకూరే ప్రయోజనాలు… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్) ద్వారా లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. లబ్ధిదారుడు నామమాత్రపు మొత్తాన్ని చెల్లించినప్పుడు భూమిపై హక్కులు సంక్రమిస్తాయన్నారు. లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పొందవచ్చునన్నారు. సదరు ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను తనఖా పెట్టి బ్యాంకు లోను పొందే అవకాశం కూడా ఈ పధకం ద్వారా లబ్ధిదారులకు వుందన్నారు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉపయోగించి ఇంటిని బదిలీ చేసుకోవడానికి, అమ్మడానికి లేదా లీజుకు ఇవ్వడానికి హక్కులు కలిగి వుంటారని ఆప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

ఓటీఎస్ పధకం కింద చెల్లించవలసి న వివరాలను వెల్లడిస్తుకేటగిరీ-ఏ కింద ఇంటిపై అప్పు తీసుకున్న లబ్ధిదారుడు లేదా వారసుడు గ్రామీణ ప్రాంతమైతే రూ.10,000/- , మునిసిపాలిటీ లో రూ. 15,000/-,మునిసిపల్ కార్పొరేష న్ లో రూ.20,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించవలసి వుంటుందన్నారు.కేటగిరీ-బి కింద ఇంటిపై అప్పు తీసుకున్న అనుభవదారుడు లేదా కొనుగోలు దారుడు గ్రామీణ రూ. 20,000/- మునిసిపాలిటీ రూ. 30,000/- మున్సిపాల్ కార్పొరేషన్ లో రూ. 40,000/- రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలన్నారు.కేటగిరీ సి కింద అప్పులేని లబ్ధిదారుడు లేదా వారసుడు కేవలం రూ.10 లు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు. కేటగిరీ- డి కింద అప్పు తీసుకొననని అనుభవదారు లేదా కొనుగోలు దారుడు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/-,మున్సిపాలిటీ . 15,000/- మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 20,000/- రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించి తమ పేరుపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పొందవచ్చునన్నారు. కావున సదరు లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Check Also

పర్యాటకాభివృద్ధిలో భాగంగా చేనేతకు చేయూతనిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *