Breaking News

పీఎంజీఎస్ వై కింద రూ. 65 లక్షలతో రాపర్ల టు జమిదగ్గుమిల్లి రహదారి అభివృద్ది…

-రూ. 25 కోట్లతో పామర్రు నియోజకవర్గంలో డొంక రోడ్ల అభివృద్దికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాం…
-గతంలో పియంజీఎస్ వై కింద రూ. 7 కోట్లతో వివిధ రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసుకున్నాం…
-ఎంపి. బాలశౌరి

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారుల అభివృద్దికి ప్రాధాన్యనిస్తూ పామర్రు మండలంలో రూ. 2 కోట్లతో పలు రహదారులను అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తున్నామని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు.
పామర్రు మండలంలో రాపర్ల నుంచి జమిదగ్గుమిల్లి వరకు 2 కి.మీ నిడివి గల తారు రోడ్డును పీఎంజీఎస్ వై కింద రూ. 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారికి సోమవారం ఎంపి బాలశౌరి స్థానిక శాసనసభ్యలు కైలే అనిల్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాపర్ల నుంచి జమిదగ్గుమిల్లి వరకు 2 కి.మీ మేర రహదారి అభివృద్ది శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉన్నారు. పామర్రు నియోజకవర్గంలో గతంలో పియంజీఎస్ వై కింద రూ. 7 కోట్ల మంజూరు గాగా వివిధ రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. స్థానిక నాయకులు మరో రెండు కిమీటర్లు మేర అభివృద్ది చేయాలని కోరారని దానిని కూడా త్వరలో చేపడతామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేన్నరేళ్లు అవుతుంది. దివంగత సీయం డా. రాజశేఖరెడ్డి ఏవిధంగా పరిపాలన చేసి ప్రజా మన్ననలు పొందారో అదే స్పూర్తితో నేడు సీయం జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకేస్తు ప్రజా సంక్షేమ పథకాలను సాగిస్తున్నారన్నారు. రహదారుల అభివృద్ది పై సీయం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో డొంక రోడ్ల అభివృద్దికి రు. 25 కోట్లను మంజూరు చేయాలని పంచాయితీ రాజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరామన్నారు. త్వరలో ఈ రహదారులను అభివృద్ది చేస్తామన్నారు. డొక రోడ్లు అభివృద్దితో రైతులు తమ పొలాల్లో పండించిన ధాన్యాన్ని సులభంగా ఇంటింకి చేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. పామర్రు మండలంలో యంపీ ల్యాండ్స్ మరియు ఎన్ఆర్ఈ జీఎస్ పధకం కింద రూ. 2 కోట్లతో వివిధ రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. రానున్న ఒక మాసంలో దీనికి అత్యంత ప్రాధాన్యనిస్తూ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని యంపీ బాల శౌరిఅన్నారు.
స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని వర్గాల్లోని ప్రజలకు అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలను అందించారన్నారు. సంక్షేమానికి ఒకవైపు, అభివృద్దికి మరో వైపు అత్యంత ప్రాధాన్యనిస్తూ నాడు- నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులను ఆధునీకరిస్తూ మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించి ఉద్యోగులను నియమిస్తూ గ్రామస్థాయిలోనే ప్రజలకు సుపరిపాలలను అందించారన్నారు. పామర్రు మండలంలో అన్ని రహదారులను అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం రాపర్ల నుంచి జమిదగ్గుమిల్లి వరకు మిగిలిపోయిన మరో 2 కి.మీ. రహదారిని కూడ అభివద్ది పర్చడం జరగుతుందని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున యంపిగా బాల శౌరిని, ఎఎమ్ఎల్ ఏ గా నాకు అత్యంత మెజారిటిని అందించి గౌరవించారు. తప్పక ఈ గ్రామాల ప్రజల రుణం తీర్చుకుంటామని ఈ సందర్బంగా శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *