Breaking News

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం చేసుకోవాలి…
-మెగావ్యాక్సినేషన్ ద్వారా సచివాలయాల్లో అందిస్తున్నకోవిడ్ టీకాలను ప్రతి ఒక్కరు వేయించుకోవాలి…
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా నిబంధలు పాటిస్తూ 18 ఏళ్లు వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ మొదటి, రెండవ మోతాల వేయించుకోవాలని, ఇందుకొరకు డివిజన్ పరిదిలోని ప్రతి సచివాలయంలో మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు.
స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి వారికి న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు.

మెగా వ్యాక్సినేషన్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి…
గుడివాడ డివిజన్ పరిదిలో ఆదివారం 2 కోవిడ్ పోజటికేసులు నమోదయ్యి ఒకశాతం మాత్రమే ఉన్నప్పటికీ కోవిడ్ నియంత్రణ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 18 ఏళ్ళు వయస్సు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ఇందుకొరకు మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రతి సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచారన్నారు. కోవిడ్ కట్టడే లక్ష్యంగా షాఫులు, వాహనాలు, వ్యాపార వాణిజ్య సంస్థంలో “నో మాస్క్ నో ఎంట్రీ”, “నోమాస్క్ నో రైడింగ్”, “నోమాస్క్ నో సేల్” బోర్డులను ప్రదర్శిస్తూ వినియోగదారులుకు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ పోయిందని ఎవరూ భావించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ సద్వినియోగం చేసుకోవాలి…
రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొన్నారని, అందులో కొంత మంది స్వంతగా ఇళ్లు నిర్మించుకోగా మరి కొందరు గృహనిర్మాణ సంస్థ లో వారికి అలాట్ చేసిన పట్టాను తాకట్టు పెట్టి రుణం పొందారన్నారు. వీరందరికీ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ కోరారు. ఈ పథకం కింద కేటగిరీ -ఏ కింద ఇంటిపై అప్పు తీసుకున్న లబ్ధిదారుడు లేదా వారసుడు గ్రామీణ ప్రాంతమైతే రూ.10వేలు, పురపాలకసంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించవలసి వుంటుందన్నారు. కేటగిరీ-బి కింద ఇంటిపై అప్పు తీసుకున్న అనుభవదారుడు లేదా కొనుగోలు దారుడు గ్రామీణ రూ.20 వేలు, పురపాలకసంఘాల్లో రూ.30వేలు, నగరపాలక సంస్థల్లో రూ.40వేలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించవలసి వుంటుందన్నారు. కేటగిరీ-సి కింద అప్పులేని లబ్ధిదారుడు లేదా వారసుడు కేవలంరూ.10 లు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు. కేటగిరీ-డి కింద అప్పు తీసుకొననని అనుభవదారుడు లేదా కొనుగోలుదారుడు గ్రామీణప్రాంతాల్లో రూ.10వేలు, పురపాలకసంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించి తమ పేరుపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పొందవచ్చునన్నారు. కావున సదరు లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిఎల్పీవో నాగిరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ. గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *