-సెంట్రల్ లో రైతు భరోసా రెండో విడత ద్వారా 81 రైతు కుటుంబాలకు రూ. 3,24,000 లబ్ధి
-రెండున్నరేళ్లలో రైతు భరోసా ద్వారా మొత్తం రూ. 25,78,500 అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు రుణదాతలపై ఆధారపడకుండా అవసరమైన వనరులు సకాలంలో కొనుగోలు చేసుకునేందుకు గాను రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ నియోజకవర్గానికి గాను 73 రైతు కుటుంబాలకు రూ. 13,500 చొప్పున రూ. 9 లక్షల 85 వేల 500 అందజేయడం జరిగిందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 73 రైతు కుటుంబాలకు గాను రూ. 13,500 చొప్పున రూ. 9 లక్షల 85 వేల 500 రూపాయలను అందజేశామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతు భరోసా మొదటి విడత కార్యక్రమంలో భాగంగా 81 రైతు కుటుంబాలకు రూ. 6,07,500 రైతుల ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు. రెండో విడతకు గాను 81 రైతు కుటుంబాలకు మంగళవారం రూ. 3 లక్షల 24 వేల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. 2019 నాటి నుంచి ఇప్పటివరకు రెండున్నరేళ్లలో మొత్తంగా 81 రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల 78 వేల 500 రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరినట్లు మల్లాది విష్ణు గారు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు అన్నదాతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత చంద్రబాబు ప్రభుత్వం రైతులను నిండా దగా చేసిందని.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకువచ్చిందని వెల్లడించారు. రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గత తెలుగుదేశం హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు బకాయిలు పెట్టిన రూ.990 కోట్లను.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టగానే చెల్లించడం జరిగిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ పథకాలతో జగనన్న ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు భరోసా పథకం కాన్సెప్ట్ చాలా బాగుందని ఇటీవల ప.గో. జిల్లా పర్యటనకు వచ్చిన కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ సైతం అభిప్రాయపడటం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి రైతన్నలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని మల్లాది విష్ణు కోరారు.
Prajavartha Online Telugu News