-సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 57 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు.
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కారం చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సూచించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ (సిసిఎల్‌ఏ) 22, పౌర సరఫరాలు 3, పోలీస్ 5, వియంసి 8, ఇతర అన్ని శాఖలకు సంబంధించి మరో 19 అర్జీలు కలిపి మొత్తం 57 ఆర్జీలు స్పందన ద్వారా అందాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలోపే స్పందనలో వచ్చిన ఆర్జీలు పరిష్కారించాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. స్పందనలో అందిన వినతుల్లో కొన్నింటిని అక్కడికి అక్కడే సంబంధిత తహాశీల్దార్లకు, ఫోన్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన జి ఇన్నయ్య ఆర్జీని ఇస్తూ 5 కుమారులు ఒక కుమార్తె కలిపి 6 గురు సంతానమని అయితే మొదటి కుమారుడు చనిపోగా రెండవ కుమారుడైన మరియదాస్ వృద్ధాప్యాన్ని శక్తి హీనతను ఆసరాగ తీసుకుని నన్ను మోసగించి కీసరలోగల తన పొలాన్ని వ్రాయించుకోవడంతోపాటు ఖాళీ నోటు రాయించుకున్నారని నన్ను చిత్రహింసలు పెడవుతున్నారని ఫిర్యాదు చేస్తూ నాకు న్యాయం చేసి అక్రమంగా రాయించుకున్న నా పొలాన్ని ప్రాంసరి నోట్లను తిరిగి ఇప్పంచవలసిందిగా కోరుతున్నాను అన్నారు. దీనిపై సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ స్పందిస్తూ ఈ విషయం పై తగు చర్యలు తీసుకుని నాణ్యం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
విజయవాడ బాడవపేటకు చెందిన బావిరెడ్డి శాంతి సబ్ కలెక్టర్‌కు అర్జీని అందజేస్తూ మా కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నామని తన భర్త కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారని మాకు 7 నెలల క్రితం రేషన్ కార్డు మంజూరైందని కార్డులో మా పెద్ద కుమార్తె బవిత పేరు నమోదు కాలేదని తెలిపారు. నా కుమర్తె బవిత ప్రస్తుతం ఇంటర్ మీడియట్ చదువుతుంది. మేము ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ది పొందలేదని మా కుమర్తి ఫీజుకు సంబంధించి కళాశాలలో రేషన్ కార్డు ఇవ్వవల్సిఉందని తెలిపారు. దయచేసి మా కమార్తి పేరును కూడా రేషన్ కార్డుతో నమోదు చేసి మాకు రేషన్ కార్డు ఇప్పించాలని కోరుకుంటున్నాను. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో విచారణ నిర్వహించి త్వరలో రేషన్ కార్డును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కార్యాలయ ఏఓ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.