అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏఐటీటీ 2020 (సీటీఎస్)లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ సాధించిన ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఒక్కోక్క విద్యార్ధికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం, ఏపీఐఐసీలో వారి చదువుకు అనుగుణంగా ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. డి.మణికంఠ, మెకానిక్ డీజిల్ ట్రేడ్‌లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్ ఇండియా ఐదో ర్యాంక్, ఎన్.కుమారి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆల్ ఇండియా ఆరో ర్యాంక్, ఎం.బాల పవన్ రాజు, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఆల్ ఇండియా ఎనిమిదో ర్యాంక్, ఎం.రోషణ్, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ, ఆల్ ఇండియా తొమ్మిదో ర్యాంక్ లో ఉన్నారు. విద్యార్థులతో పాటు కౌశలాచార్య అవార్డు 2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ వై.రజిత ప్రియను కూడా సీఎం జగన్ అభినందించారు. ఆమెకు కూడా రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. విద్యార్థులకు మెమెంటోలతో పాటు సర్టిఫికెట్‌లు, ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి, రీజనల్ డైరెక్టర్ ఏ.వెంకటేశ్వర రావు, జాయింట్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …