Breaking News

చిత్రలేఖనం పోటీలు సృజనాత్మకతకు అద్దం పట్టాయి…

– డీఈవో తహెరా సుల్తానా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
54 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంధాలయంలో గురువారం విజయవాడ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు జరిగాయి. జూనియర్, సీనియర్ విభాగాలలో జరిగిన ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా ప్రారంభించారు. సీనియర్ విద్యార్థులకు ఆజాదీ కా అమృత్ మహొత్సవ్ అంశంపై, జూనియర్ విద్యార్థినీ విద్యార్థులకు మనబడి నేడు (ఆదర్శ పాఠశాల ) అంశంపై జరిగిన ఈ పోటీలకు జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కొండా రవికుమార్ హాజరై పోటీల తీరును పరిశీలించారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కంచల నాగరాజు విద్యాశాఖాధికారి శ్రీమతి తహెరా సుల్తానా కు పుష్పగుచ్ఛముతో స్వాగతం పలికి పోటీల వివరాలను తెలియజేసారు. ఈ సందర్బంగా డిఈఓ సుల్తానా మాట్లాడుతూ బాలల్లో వున్నా సృజనాత్మకతను వెలికితీసే విధంగా చిత్రలేఖనం పోటీలున్నాయన్నారు. పోటీలకు హాజరైన బాలబాలికలందరూ వాళ్ళ లోని ప్రతిభను చాటుకునే రీతిలో చిత్రాలు గీశారన్నారు. ఈ పోటీలకు ఆర్ట్ సొసైటీ బాధ్యులు అప్పారావు, కళాసాగర్, అబ్దుల్లా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రామచంద్రుడు, కళ్లేపల్లి మధుసూదన రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు బొడ్డపాటి దాసు నిర్వహణలో విద్యార్థినీ విద్యార్థులకు పాటల పోటీలు జరిగాయి. దేశభక్తిగేయాలు జానపద పాటలు పాడి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్బంగా కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కంచల నాగరాజు మాట్లాడుతూ ఈ పోటీలు పిల్లల్లో వున్నా సంగీత కళను సమాజానికి తెలియజేస్తాయన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *