– ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలి.
-సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రానికి తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టాలి.
-పరిశరాలను పరిశుభ్రంగా వుంచి ప్రజల ఆరోగ్యం కాపాడాటం మన బాధ్యత.
-పంచాయితీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి.
-పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా పాండే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమ చేయాలని పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా పాండే అధికారులను ఆదేశించారు.
మంగళవారం గొల్లపూడి డీఆర్డీఏ కార్యాలయంలో జగనన్న స్వచ్చ సంకల్పం, స్వచ్చ సర్వేక్షణ, జగనన్న పాలవెల్లువ, వైఎస్సార్ జలకల, ఎన్ఆర్ఈ జిఎస్, ఓటీఎస్, స్పందన అంశాలతో పాటు పంచాయితీరాజ్ చేపట్టిన పలు ప్రభుత్వ పథకాల పురోగతి పై డిఎల్పీవోలు, యంపీడీవోలు ఈవో పీఆర్ ఆర్డీలు, డీపీఆర్ సీ సబ్బందితో స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా పాండే సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జగనన్న స్వచ్చ సంకల్పం క్లాప్ కార్యక్రమాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రాలకు తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టాలన్నారు. పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది విధి విధానాలను అనుసరిస్తూ బాధ్యాతాయుతంగా నిర్వహించాలనానారు. పరిశరాలను పరిశుభ్రంగా వుంచి ప్రజల ఆరోగ్యం కాపాడాటం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్య మన్నారు. చెత్త రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు మండల గ్రామ స్థాయి అధికారులు ప్రణాళికా బద్దంగా జగనన్న స్వచ్చ సంకల్పం అమలు చేస్తూ క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు, ఎన్జీవోలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. మన ఊరు-మన శుభ్రత అనే అంశంపై గ్రామాల్లో ర్యాలీను నిర్వహించాలన్నారు. జిల్లాలో బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ప్రతి రోజు గార్బేజ్ ఇళ్లలో తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసి చెత్త నిల్వ కేంద్రాలకు తరళించే విధంగా అధికారులు పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించి గార్బేజ్ ను యార్డుకు తరలించిన అనంతరం జగనన్న స్వచ్చసంకల్పం యాప్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సూర్య ప్రకాశరావు, డీపీవో జ్యోతి, డ్వామా పీడీ సూర్యనారాయణ, జిల్లాలోని యంపీడీవోలు,డిఎల్పీవోలు, ఈవో పీఆర్ ఆర్డీలు, డీపీఆర్ సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.