Breaking News

ఇంటింటికీ రేషన్ పంపిణీని సక్రమంగా నిర్వహించాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటింటికీ రేషన్ పంపిణీపై పౌర సరఫరాలశాఖ అధికారులు , రేషన్ పంపిణీ వాహనాల డ్రైవర్లతో గురువారం జరిగిన సమావేశంలో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని , ప్రజల నుండి ఎటువంటి విమర్శలకు తావులేకుండా రేషన్ పంపిణీని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం అమలులో అధికారులు, ఎండియు వాహన డ్రైవర్లు, వాలంటీర్లు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. ప్రతీ లబ్దిదారుడి ఇంటికి తప్పనిసరిగా వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన రేట్ కే రేషన్ అందించాలన్నారు. రేషన్ పంపిణీని వాలంటీర్లు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని తాను ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని, ఎక్కడైనా వాలంటీర్లు రేషన్ పంపిణీలో అలసత్వం వహించినట్లు తన దృష్టికి వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. రేషన్ పంపిణీలో ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆర్డీఓ చెప్పారు. సమావేశంలో సహాయ పౌరసరఫరాల అధికారి పార్వతి, నూజివీడు తహసీల్దార్ ఎల్లారావు, సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ఎం. హరనాథ్, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు ప్రసాద్, వెంకటరమణ, సీత, ఎండియు ఆపరేటర్లు, ప్రభృతులు, పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *