Breaking News

దాతలు దాతృత్వంలో సహకరిస్తూ కళ్యాణ మండపం అభివృద్ది కృషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు…

-సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నాకు ఇంతటి గౌరవాన్ని సీయం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు..
-వెలమ సంక్షేమానికి విరాళంగా రూ. 3 లక్షలు అందించిన డిప్యూటీ సీయం.
-రాష్ట్ర డిప్యూటీ సీయం మరియు రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్
-గుడివాడలో మున్సిపల్ స్థలాన్ని వెలమ సంక్షేమ సంఘానికి కేటాయించేందుకు చర్యలు
-రూ.1.20 కోట్లతో నిర్మించుకోవడం అభినందనీయం
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దాతలు దాతృత్వంలో సహకరిస్తూ కళ్యాణ మండపం అభివృద్ది కృషిచేసి ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాని రాష్ట్ర డిప్యూటీ సీయం మరియు రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
స్థానిక శ్రీరామపురం గౌతమబుద్ధ హాస్టల్ స్థలంలో రూ. కోటి 20 లక్షలతో నిర్మించిన వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని డిప్యూటీ సీయం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)తో కలసి గురువారం ప్రారంభించారు. వెలమ సంక్షేమ సంఘ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి మరడాని రంగారావు,నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, ఎన్టీఆర్ ఉపాధ్యక్షులు,పాలడుగు చంటి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ సందర్భంగా డిప్యూటీ సీయం, రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వెలమ సంక్షేమ సంఘ నూతన భవనానికి దాతృత్వంతో దాతలు సహాయం మరువలేనిదని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాన్నారు. వెలమ సంక్షేమ సంఘం అభివృద్దికి తన వంతుగా సహాకారంగా రూ. 3 లక్షలు విరాళాన్ని అందిస్తున్నాని ప్రకటించారు. మనం జీవించి లేకపోయినా మనం చేసిన దానం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కళ్యాణ మండపం నిర్మాణంలో సహకరించాలన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు ముఖ్యఅతిధిగా ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. ఇంతటి గౌరవాన్ని అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు శాతం అండగా ఉంటానన్నారు. అదేవిధంగా మనకు సహాయ పడే వ్యక్తులను గౌరవించడం మన మన కర్యవ్యమన్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) పెద్ద మనస్సుతో వెలమ సంక్షేమం సంఘం అభివృద్దికి మరో నూతన భవన నిర్మాణానికి స్థలం అందిస్తాననడం శుభపరిణామం అన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ. గుడివాడ పట్టణంలో వెలమ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి 2 వేల గజాల స్థలాన్ని ఇప్పిస్తానని సంఘీయులకు హామీ ఇచ్చానని తెలిపారు. శ్రీరాంపురంలోని గౌతమబుద్ధ హాస్టల్ ను వందేళ్ళ కిందట తమ పూర్వీకులు స్థాపించి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన సంఘీయులకు విద్యా, వసతి సౌకర్యాలను కల్పించారని, ఎంతో మంది ఉన్నతికి కృషి చేశారని గుడివాడ వెలమ సంక్షేమ సంఘ నాయకులు చెప్పారన్నారు. గౌతమబుద్ధ హాస్టల్ స్థలంలోనే వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించాలని సంఘీయులంతా భావించారన్నారు. ఏడాది సమయంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు.గుడివాడ ప్రాంతంలో అనేక కులాలు ఉన్నాయని, వెలమ సంఘీయులకు అన్ని హంగులతో సంఘ భవనాన్ని అందుబాటులోకి రావడం అభినందనీయమని చెప్పారు. వెలమ సంఘీయులకు క్రమశిక్షణ, ఏదైనా సాధించాలన్న పట్టుదల, పెద్దల పట్ల గౌరవం ఉంటాయన్నారు. పూర్వం నుండి ప్రతి కులానికీ కొన్ని ప్రత్యేకతలు ఉంటూ వస్తున్నాయని, మన పూర్వీకులు ముందు చూపుతో ఎన్నో ఆలోచనలు చేశారన్నారు. వాటిని అనుసరిస్తూ, తమ పూర్వీకులు తిరిగిన గౌతమబుద్ధ హాస్టల్ స్థలాన్ని కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపిక చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఒక్క ఏడాదిలోనే రూ. కోటి 20 లక్షల విరాళాలను సేకరించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రస్తుతం ఈ వెలమ సంక్షేమ సంఘ భవనంలో చిన్నచిన్న శుభకార్యాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. పెద్ద పెద్ద ఫంక్షన్లను నిర్వహించుకునేందుకు ఇంకో భవనం అవసరం ఉంటుందన్నారు. వెలమ సంఘీయులు ఇతర కులాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. మిగతా కులాల సంఘీయులు కూడా ఇటువంటి భవనాలను నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. దీనివల్ల సంఘీయులకు కూడా ఎంత మేలు చేకూరుతుందని, ఏవైనా సమస్యలుంటే ఒక వేదికపైకి వచ్చి ఐక్యంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భవన నిర్మాణానికి సహకరించిన దాతలను మంత్రి కొడాలి నాని అభినందించారు. కష్టకాలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబానికి డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అండగా నిలిచారన్నారు. 2010 నవంబర్ నెల్లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు ఎంత చెప్పినా వినకుండా డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ కు అండగా నిలిచారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రేమగా పిలిచేవారని, ఆయన మరణం తర్వాత జగన్ వెనక నడిచేందుకు ఎమ్మెల్యే పదవిని కూడా ధర్మాన కృష్ణదాస్ వదులుకున్నారన్నారు. అప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కూడా వెళ్ళలేదని, ఏం జరుగుతుందో తెలియకపోయినా వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండేందుకు ధర్మాన కృష్ణదాస్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారన్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యేగా గెల్చిన ధర్మాన కృష్ణదాస్ తన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం జగన్ కు సలహా కూడా ఇచ్చారన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటి సీఎం పదవిని ఇచ్చి సీఎం జగన్ కూడా కృతజ్ఞత చూపారన్నారు. డిప్యూటి సీఎం పదవిని చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ కేబినెట్ మంత్రులందరితో సఖ్యతగా మెలుగుతూ వస్తున్నారన్నారు. తన దగ్గరకు ఏ పనిమీద వచ్చినా కుల, మతాలు చూడకుండా గౌరవంగా మాట్లాడి పనిచేసి పంపుతారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి కావడంతో తాను ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం నర్సన్నపేటలోని ఆయన ఇంటికి కూడా వెళ్ళానన్నారు. ఎంతో ప్రేమానురాగాలతో ధర్మాన కృష్ణదాస్ కుటుంబ సభ్యులకు తనను ఆదరించారని గుర్తు చేసుకున్నారు. వెలమ సంఘీయులు ధనిక కమ్యూనిటీ అని ఇక్కడ వచ్చే వరకు తనకు తెలియదన్నారు. ధనికులు అంటే కోట్లాది రూపాయల డబ్బు సంపాదించిన వారు కాదని, మంచి పనికి స్థాయికి మించి సహకారం అందించేవారేనని అన్నారు. ముందుగా డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ కు వెలమ సంక్షేమ సంఘం నేతలు పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నానితో కలిసి డిప్యూటి సీఎం ధర్మాన వెలమ సంఘీయుల ఐక్యతను చాటుతూ చేతులు కలిపారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నవరత్నాలు అమలు కమిటీ వైసైచైర్మన్ అంకమరెడ్డి నారాయణమూర్తి, మాజీ మంత్రి మరడాని రంగారావు, వెలమ కార్పోరేషన్ డైరెక్టర్లు జీ మాధవి, జీ శ్రీనివాసరావు, నవుడు వెంకటరమణ, గుడివాడ వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, అధ్యక్షుడు గంటా ఆనంద్, ప్రధాన కార్యదర్శి గులిపల్లి ప్రభాకరరావు, విజయవాడ అధ్యక్షుడు మూకల అప్పారావు, జడ్పీటీసీ సభ్యుడు రొంగల అప్పాజీ, సంఘ నాయకులు మూడెడ్ల రామారావు, సంభంగి రంగారావు, చింతల భాస్కరరావు, సింగిరెడ్డి గగారిన్, నగిరెడ్డి మోహన్, సబ్బాని రంగారావు, మూడెడ్ల ఉమా, మూడెడ్ల శ్రీధర్, గంటా చంద్రశేఖర్, వంగపండు బ్రహ్మాజి, వీ బాబు, గులిపల్లి రవికుమార్, గేదెల రమేష్, సిరిపురపు కిరణ్ కుమార్, గంటా శ్రీనివాసరావు, దత్తి సింహాచలం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *