Breaking News

సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు అమీనా పేట ఏటిగట్టులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. బుధవారం సాయంత్రం కలెక్టర్ అమీనా పేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం సందర్శించి విద్యార్థులతో కొంతసేపు 5వతరగతి , 8వ తరగతి చదువు తున్న సబ్జెక్టుల లపై ప్రశ్నలు వేసి వేశారు. సబ్జెక్టుకు సంబంధించి విషయాలు విద్యార్థులు బాగానే తెలిపారు. కానీ ఇంగ్లీష్ లో చెప్పడంలో కొంచెం తడబడ్డారు. దీనిపై కలెక్టర్ విద్యార్థులకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంచెం తక్కువగా ఉంది . ఇంగ్లీష్ నైపుణ్యం పెంచేందుకు ప్రైవేట్ షూటర్ ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. ఆహారాన్ని కలెక్టర్ రుచి చూశారు. ఆహారం బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు . అనంతరం టాయిలెట్లను కలెక్టర్ పరిశీలించారు. టాయిలెట్స్ బాగానే ఉన్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గోడలపై ఉన్న కొటేషన్స్ ను విద్యార్థుల చేత చదివించి వాటి అర్థాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఏమి అవ్వాలని అనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్ ను పరిశీలించారు. జిల్లాలో కాంపౌండ్ వాల్ లేని వాటికి బయో పెనిషింగ్ ఏర్పాటు చేయాలని ఆయన సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమ) శ్రీమతి పి. పద్మావతి , సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *