అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సచివాలయం రెండవ బ్లాకులో పిఆర్సి పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో పిఆర్సి స్ట్రగుల్ కమిటీ సభ్యులు సమావేశమై వారి విజ్ఞాపలను మంత్రులకు అందజేసి పిఆర్సి సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ కమిటీలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, పేర్ని వెంకట్రామయ్య (నాని), ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాల తరుపున స్ట్రగుల్ కమిటీ సభ్యులు బండి శ్రీనివాసరావు , కె ఆర్ సూర్యనారాయణ, కె వెంకటరామి రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు లతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.