అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నాలుగు కాళ్ల మండపం ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మాణానికి మరియు నాలుగుకాళ్ల మండపం ఎదురు ఆంజనేయ స్వామి వారి గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్కే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి బైపాస్ నందు గల నాలుగు కాళ్ల మండపం ప్రాంగణాన్ని కాపాడడానికి ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండటానికి 1.86 సెంట్ల స్థలానికి దాదాపు 40 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుందని అన్నారు. మంగళగిరి బైపాస్ కు తూర్పు పడమర భాగంలో దాదాపు 2 ఎకరాల 26 సెంట్ల స్వామి వారి భూమి ఉందని ఈ ఆస్థి దాదాపు 30 కోట్ల రూపాయలు ఉంటుందని దీనిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి స్వామి వారి ఆస్తులను పరిరక్షించాలని అన్నారు. అలాగే నాలుగుకాళ్ల మండపం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఎంతో కాలంగా చెట్టుకింద ఉందని నాలుగు కాళ్ళ మండపం ఎదురుగా ఆంజనేయ స్వామి వారి కోసం ఒక ఆలయాన్ని దాతల సహకారంతో మునగాల మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …