Breaking News

ఘనంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపి హైకోర్టు న్యాయవాది కె.సింహాచలం కి సన్మానం…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతం అయిన ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కోసం న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపి హైకోర్టు న్యాయవాది కె.సింహాచలం ని ఘనంగా సన్మానించి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వలిబోయిన గురునాధం అభినందన తెలియచేసారు. ఏపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ హైకోర్టు న్యాయవాది కె.సింహాచలం  ఉద్ధానం పేద ప్రజలు భయంకరమైన కిడ్నీ వ్యాధితో అనారోగ్యం పాలై, వందలాది మంది అసువులు బాసిన విషయమై ఏపీ హైకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా  స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి తానే స్వయంగా వాదనలను వినిపించి…ఉద్ధానం ప్రాంతంలో పేద గిరిజన ప్రజల కోసం ఆ ప్రాంతంలో శాశ్వతంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించాలని, మొబైల్ డయాలసిస్ వాహనాలను ఏర్పాటు చేయాలని, వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా తన వాదనలు వినిపించడం జరిగిందని, ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పిటిషనర్ సూచించిన వసతులను కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనీ, ఉద్ధానం పేద ప్రజల తరపున న్యాయ పోరాటం చేసి విజయం సాధించినందుకు గాను హైకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సింహాచలం కి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు , లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశన రామకోటేశ్వరరావు , సుప్రీం కోర్టు న్యాయవాది కేశన విష్ణువర్ధన్, బెజవాడ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది కె.సుబ్రహ్మణ్యం, న్యాయవాది ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగ్ మరియు సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ తూమటి బాలు, నగర ఉపాధ్యక్షులు బూదాల జోసఫ్ తదితరులు కె.సింహాచలం ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *