Breaking News

కరగ్రహారం లేఅవుట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి -అధికారులను ఆదేశించిన మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని ఆదివారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి కరగ్రహారం లేఅవుట్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముడ కార్యాలయంలో రెవెన్యూ మున్సిపల్, డ్వామా, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కరగ్రహారం లేఅవుట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నియోజకవర్గంలో అర్బన్, రూరల్ లబ్ధిదారులకు 12 బ్లాకులలో 16వేల మంది పైగా లబ్ధిదారులకు 300 ఎకరాలలో అతిపెద్ద లేఅవుట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏమిటీస్ సెక్రటరీలు, వీఆర్ఏలుతో టీములు ఏర్పాటు చేయాలని, జరుగుతున్న పనులు డి ఇ, ఏ ఇ లు ప్రతిరోజు క్షేత్ర స్థాయి పర్యవేక్షణ నిర్వహించాలని, ఈ పనుల్లో భాగస్వామ్యం అయ్యే అధికారులు సిబ్బందితో వాట్స్అప్ గ్రూపులు ఏర్పాటు చేసి సిబ్బంది విధులకు హాజరు,పనులపురోగతి ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయాలన్నారు.ఏ ఏ శాఖలు ఏ ఏ పనులు చేయాలి మంత్రి నిర్దేశించారు.తొలుత సర్వేయర్లు సోమ మంగళ వారాల్లో లేఅవుట్ ప్రకారం అప్రోచ్ రోడ్డు, అంతర్గత రహదారులు, బౌండరీలు గుర్తించాలని బుధవారం నుండి ప్రతి ప్లాటుకు సరిహద్దు రాళ్ళు ఏర్పాటు చేయాలని, అప్రోచ్ రోడ్డుకు గ్రీన్ కలర్, అంతర్గత రోడ్ల కు బ్లూ కలర్ వేయాలని అన్నారు. లే అవుట్ అంతా జంగిల్ క్లియరెన్స్ కోసం జెసిబిలు సిద్ధం చేయాలని అన్నారు. సాధ్యమైనంత మెరక చేయాలని, ఈ పనులన్నీ శని వారం లోగా పూర్తి చేసి, ఈ నెల 28 29 తేదీలు సోమ మంగళ వారాల్లో లబ్ధిదారులకు వారివారి ప్లాటు భూమిపై చూపించాలన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, ముడా చైర్పర్సన్ నాగలక్ష్మి భవాని, ముడా విసి నారాయణరెడ్డి, డిప్యూటీ మేయర్ కవిత, ఆర్ డి ఓ ఎన్ఎస్ కె ఖాజావలి,డ్వామా పిడి జి వి సూర్యనారాయణ, కమిషనర్ శివరామకృష్ణ, తాసిల్దారు డి సునీల్ బాబు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విటల్ పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *