Breaking News

జగనన్న భూ సర్వే పనులు వేగవంతం చేయండి : తహసీల్దార్లకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులను వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులపై సోమవారం డివిజన్ లోని తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వివాదాలు లేని భూ రికార్డులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం ద్వారా భూ సర్వే పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో భూ సర్వే పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందుకోసం భూ రికార్డుల స్వచీకరణ పూర్తి చేయడం జరిగిందని, సదరు రికార్డుల ననుసరించి భూ సర్వే పనులను చేపట్టామన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులనునూజివీడు డివిజిన్ లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులు 36 వేల 142 ఎకరాలలో చేపట్టవలసి ఉండగా, ఉంటావరకు 23 వేల 565 ఎకరాలలో సర్వే పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా తిరువూరు మండలంలో 2 వేళా 646 ఎకరాలలో , ఉంగుటూరు మండలంలో 6 వేల 282 ఎకరాలలో , రెడ్డిగూడెం మండలంలో 2 వేల 646 ఎకరాలలో , గంపలగూడెం మండలంలో 930 ఎకరాలలో సర్వే పనులు పెండింగ్ లో ఉండడంతో వెంటనే సర్వే పనులు వేగవంతం చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనీ సంబంధిత తహసీల్దార్లను ఆర్డీఓ ఆదేశించారు. తహశీల్దార్లతో సమన్వయం చేసుకుని సర్వే పనులను పర్యవేక్షించాలని, సర్వే పనులు మరింత వేగవంతంగా జరిగేలా చూడాలని సర్వే శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ను ఆర్డీఓ ఆదేశించారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాథ్, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *