Breaking News

ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యాలి…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. ధవలేశ్వరం లోని 2 వ గ్రామ సచివాలయన్నీ కలెక్టర్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సచివాలయ ఉద్యోగులు స్పందించి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన తో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. మీరు ప్రజా సమస్యలపై వొచ్చే ఫిర్యాదు ల విషయంలో మనస్సు తో స్పందించి వారికి భరోసా ఇవ్వాలన్నారు. మీరు సచివాలయ పరిధిలో సమస్య పరిష్కారం చేస్తే, ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై స్పందన కార్యక్రమానికి కలెక్టర్ కార్యాలయానికి రావలసిన అవసరం, ప్రజలకు వ్యయ ప్రయసాలకు తావులేకుండా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ఆయా లక్ష్య సాధనకు అనుగుణంగా మనం పనిచెయ్యలని పేర్కొన్నారు.

సచివాలయాలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. అంతకు ముందు హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదు లను ఎస్ ఎల్ ఏ (రాష్ట్ర స్థాయి సగటు) పరిధిలో నే పరిష్కారం చూపాలని ఆదేశించారు. పనితీరు లో నిబద్ధత, జవాబుదారీతనం ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ పర్యటన లో రెవెన్యూ, సచివాలయ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *