సచివాలయ కార్యదర్సులు, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలను అర్హులైన లబ్ధిదారులకు అందచేయ్యడం లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలి…

కొరికొండ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ కార్యదర్సులు, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలను అర్హులైన లబ్ధిదారులకు అందచేయ్యడం లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం బురుగుపూడి సచివాలయం, దోసకాయపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన తో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పరిష్కార దిశగా ఒక ప్రత్యేక వ్యవస్థ తీసుకుని వొచ్చారన్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన తో ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు.

మీరు ప్రజా సమస్యలపై వొచ్చే ఫిర్యాదుల సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపి వారికి భరోసా కల్పించే భాద్యత చేపట్టాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రజా సమస్య పరిష్కారం చేస్తే, కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు రావలసిన అవసరం ఉండదన్నారు. స్నేహపూర్వక విధానంలో ప్రజా సమస్యలపై స్పందించి, ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరువ చెయ్యాలని శ్రీధర్ పేర్కొన్నారు. విధుల్లో నిబద్ధత, జవాబుదారీతనం ఉండటం ముఖ్యమని జేసి సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. పిల్లల్లో శరీర దారుడ్యా న్నీ పెంచేందుకు అంగన్వాడీ కేంద్రాలు ద్వారా పౌష్టికాహారం అందించడం పై సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులతో ముచ్చటిస్తూ, అంగన్వాడీ టీచర్, ఆయాలు మీతో ఎలా ఉంటారని అడిగి తెలుసుకున్నారు. వారికి నేర్పిస్తున్న రైయిమ్స్ జేసి అడుగగా చక్కగా పాడి వినిపించారు. నేటి పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రభుత్వం అందచేస్తున్న పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందించడం, ఆటపాటలతో వారిలో విజ్ఞానం పెంచేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలో సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలను ఇకపై ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. హాజరు పట్టిక, బాలల హాజరు శాతం, ఆరోగ్య పరిస్థితి పై వివరాలు జేసి తెలుసుకున్నారు. ఈ పర్యటన లో రెవెన్యూ, సచివాలయ కార్యదర్శి, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *