కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయనీ, ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఏటిపర్రు గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రజలతో మాట్లాడుతూ, కరోనా మహమ్మారితో ఏర్పడ్డ ఆర్ధిక ఇబ్బందులు, గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పులు, ప్రకృతి బీభత్సాన్ని సైతం తట్టుకొని ప్రజలకు మేలు చేస్తున్న జగన్ మంచి మనసు, దూరదృష్టి మరెవ్వరికీ ఉండబోదని అన్నారు. ఆయన కాలినడకన ఏటిపర్రు గ్రామంలో కొప్పాడి వెంకటేశ్వరరావు , తిరుమాని ఏడుకొండలు ,కోప్పాడ గోవర్దని, మైల నరసింహస్వామి, కొప్పాడ రామకృష్ణ, బఱ్ఱె సావిత్రి, కొప్పాడ పెద్దింట్లమ్మ తదితరుల గృహాలకు మంత్రి జోగి రమేష్ స్వయంగా వెళ్లి వారితో ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు గురించి ప్రశ్నించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ చేదోడు, అమ్మ వడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సున్న వడ్డీ రుణాలు, రైతు భరోసా పథకాలు, ఆరోగ్య శ్రీ సేవలు, పేదలందరికీ ఇల్లు, జలయజ్ఞం, మన బడి నాడు నేడు, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ బీమా, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ చేయూత లాంటి ఎన్నోపథకాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని అవి మీకు అందాయని వివరించారు. పేదలను అభివృద్ధి పథంలో నడపాలని నిరంతరం తపించే ముఖ్యమంత్రికి ప్రజలంతా బాసటగా , పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు మీ వద్దకు సక్రమంగా వస్తున్నాయో లేదో అని తెలుసుకుని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటిపర్రు సర్పంచ్ పెనుమాల సునీల్, కృత్తివెన్ను జడ్పిటిసి సభ్యురాలు మైలా రత్న కుమారి, ఎం పి టి సి ఎస్వి సత్య నారాయణ,సొసైటీ అధ్యక్షులు కొప్పాడ ఏడుకొండలు, మండల ప్రజా ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …