Breaking News

కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జూమ్‌కాన్ఫరెస్స్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం రిజిసేస్ట్రేషన్‌ స్కానింగ్‌ పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పై బుధవారం కలెక్టరేట్‌ నుండి జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ అజయ్‌, సబ్‌ కలెక్టర్‌ జి ఎస్‌ ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, గృహా నిర్మాణ శాఖ అధికారులు, యంపిడివోలు, తహాశీల్థార్లతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జూమ్‌కాన్ఫరెస్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వలన పెండింగ్ లో ఉన్న ఒటిఎస్‌ గృహాలు, ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకంపై గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో ఒటిఎస్‌ పథకంలో 30,115 రిజిస్ట్రర్‌ డ్యాకుమెంట్స్‌ అన్‌లైన్‌ చేయవల్సి ఉండగా, వీటిలో ఇప్పటివరకు 20,257 రిజిస్ట్రర్‌ అయ్యాయని, మిగిలిన 9,858 పెండింగ్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మండలాల్లోని సచివాలయల వారిగా ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. భూమి పట్టాలు, కోర్టు కేసులు, కుటుంబ లావాదేవీలు, డూప్లికేట్‌ సర్టిఫికేటు,్ల డబుల్‌ ఎంట్రీలు, మరణాల కేసులతో పాటు శాశ్వత వలసలు, డిజిటల్‌ సంతకాల వంటి సమస్యలను అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. డిజిటల్‌ సంతకాల విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించగా ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజి సర్విసెస్‌ లిమిటెడ్‌ (ఎపిటిఎస్‌) సహకారంతో డిజిటల్‌ సంతకాల ప్రక్రియలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *