-కరోనా సమయంలో విప్లవాత్మకంగా పనిచేసిన ప్రభుత్వం
-ప్రభుత్వ పథకాల పంపిణీలో పారదర్శకత
-ప్రభుత్వంలో అవినీతికి డిజిటల్ టెక్నాలజీతో అడ్డుకట్ట
-రూ,కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాలకు బదిలీ
-టెక్నాలజీ దన్నుతో సమర్థంగా నవరత్నాల అమలు
-ప్రభుత్వంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్
-ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకుంటున్న పలు రాష్ట్రాలు
-కాశ్మీర్‌లో జరిగిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సదస్సులో ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు జే.విద్యాసాగర్
శ్రీనగర్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు పెద్ద పీఠ వేస్తున్న ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సలహాదారు, రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జే.విద్యా సాగర్ తెలిపారు. శ్రీనగర్‌లో జరిగిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సదస్సులో ఆయన ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రభుత్వాలు టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలవని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో అవినీతికి అడ్డుకట్ట వేసి పారదర్శకంగా పాలనా ఫలాలు ప్రజలకు అందించడంలో ప్రభుత్వాలు సాంకేతిక పెద్దపీఠ వేయాల్సిన అవసరముందని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారానే ప్రభుత్వాలు ఆ ఫలాలు సాధించగలుగుతాయని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే సత్ఫలితాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా చూస్తున్నాయని చెప్పారు. అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజలకు అందివ్వాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు, టెక్నాలజీ వినియోగానికి పెద్ద పీఠ వేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
నవర్నతాలకు టెక్నాలజీ దన్ను
ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న నవరత్నాల పథకాల అమలుకు టెక్నాలజీ వినియోగమే దన్నుగా నిలుస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని ఎంతో సమర్థవంతంగా వినియోగించుకుందని, తద్వారా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పథకాలకు లబ్దిదారుల ఎంపిక మొదలు, డబ్బులు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా డిటిటల్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటోందని చెప్పారు. వీటితో పాటు గ్రామస్థాయికి పాలన తీసుకెళ్లే నేపథ్యంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల్లాంటి విప్లవాత్మక చర్యలు తీసుకుందని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో కూడా పూర్తీగా టెక్నాలజీని వినియోగించుకుని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను గ్రామస్థాయికి సమర్థంగా తీసుకెళ్లి అమలు చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంతో సాహసోపేతంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలను, టెక్నాలజీ వినియోగాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదర్శంతా తీసుకుంటున్నాయని చెప్పారు. నీతిఆయోగ్ సైతం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఏపీ చేస్తున్న కృషి చూసి అబ్బురపడిందన్నారు. స్కోచ్ అవార్డుల సాధనలో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందని పాలనా సంస్కరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్‌గా నిలిచారన్నారు.
కోవిడ్ సమయంలో సాంకేతిక విప్లం
కోవిడ్ సమయంలో సాంకేతిక వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్లవం సృష్టించిందన్నారు. అత్యంత క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం డిటిటల్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుని ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు ప్రభుత్వ ఫలాలను నిరాటంకంగా నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేసిందన్నారు. కోట్లాది రూపాయల సంక్షేమపథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు ఆ కష్ట సమయంలో ప్రభుత్వం ప్రభుత్వ ఫలాలను అందించి అండగా నిలిచిందన్నారు. డిజిటల్ టెక్నాలజీ విప్లవంతోనే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిగారి దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు.
బిగ్ డాటా ప్రభుత్వ సొంతం
డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా కొత పుంతలు తొక్కుతోందన్నారు. ప్రజల డాటాను డిజటలీకరణ చేసి తద్వారా అనూహ్యమైన ఫలితాలను సాధిస్తోందన్నారు. కేవలం పథకాలకు లబ్దిదారుల ఎంపిక, నగదు బదిలీ లాంటివే కాకుండా విద్య, వైద్య రంగంలోనూ, పాలన వ్యవస్థలోనూ వినూత్న పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళుతోందని చెప్పారు. ఈ-ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్సు, స్టేట్ డిజిటల్ సెంటర్, స్కిల్ డెవలప్‌మెంట్, వ్యవసాయరంగం, గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ తదితర పలు రంగాల్లో సాంకేతిక వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని పథకాల అమలు మొదలు, ప్రభుత్వ కార్యకలాపాలను ప్రత్యక్షంగా రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తోందని చెప్పారు. యువత నైపుణ్యాలకు సానపెట్టి వారికి ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలతో ముందుకెళుతోందని చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుని కళాశాల యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి మంచి ఉపాధి లభించేందుకు దోహదపడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీల్లో సంభవిస్తున్న సరికొత్త మార్పులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వంలో అవసరమైన చోట ఈ డిటిటల్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని మరింత ఎక్కువగా వినియోగించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా మ్ఉందుకు సాగుతోందని చెప్పారు. ప్రభుత్వ పాలనావ్యవస్థలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, టెక్నాలజీ వినియోగిత అత్యంత ఆవశ్యమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంలో పరస్పర సహకారం అందిపుచ్చుకోవాల్సిన అవసరముందన్నారు. ఒక రాష్ట్రంలో అమలు చేస్తున్న వినూత్న పంథాను మిగిలిన రాష్ట్రాలు అందిపుచ్చుకుంటే ప్రభుత్వాల గవర్నెన్స్‌లో వేగవంతమైన మార్పులు సాధ్యమవుతాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో టెక్నాలజీని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి పలు సవాళ్లను అధిగమించాల్సిన అవసరముందని, అలాగే గ్రామీణులు ఇప్పటికీ చాలా మంది టెక్నాలజీకి దూరంగా ఉంటున్నారని, వారిని కూడా టెక్నాలజీ స్రవంతిలోకి చేర్చాల్సిన అవసరముందని, ఇది సాధించడానికి ప్రభుత్వాలు పలు సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు.