-యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల భద్రత, రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న దిశ యాప్ వినియోగంపై అవగాహన, చైతన్యం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. పాతపాడు కండ్రికలో దిశా యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమంలో డీసీపీ బాబురావు, ఏసీపీ హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మలతో కలిసి ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు అత్యవసర సమయాలలో రక్షణ కల్పించడంలో దిశ యాప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వస్తారని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి మందికి పైగా యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ల దగ్గరకు వెళ్లడానికి 3వేలకు పైగా పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా దాదాపు 900 మంది మహిళలను రక్షించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. కనుక డివిజన్ లోని ప్రతి ఒక్క మహిళ, యువతి, విద్యార్థిని కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం మహిళ పోలీసులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి వారిలో అవగాహన పెంచాలన్నారు. అలాగే ఉమెన్ పోలీసులు తమ నెంబర్ ను తమ పరిధిలోని విద్యార్థినులు, ఉద్యోగస్తులు, గృహిణులకు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో చుక్కపల్లి ఐటిఐ కళాశాల విద్యార్థిని తనూష, చైతన్య పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న దేవగిరి వినూత్న సహా పలువురు విద్యార్థినులకు మహిళా పోలీసులు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని తెలియజేయడంతో పాటు.. వినియోగించే ప్రక్రియను వివరించారు. కార్యక్రమంలో ఎస్సై విజయలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, జానా రెడ్డి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, పిన్నిబోయిన కృష్ణ, ఎం. రవీందర్ రెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, రామిరెడ్డి, కిరణ్ రెడ్డి, సాదం వెంకటేశ్వరరావు, శీలం సత్యనారాయణ, వీరయ్య, మహిళా పోలీసులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News