Breaking News

2047 కల్లా దేశ వ్యాప్తంగా 150 MTకు చేరనున్న స్టీల్ స్క్రాప్ డిమాండ్

-కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్
-స్టీల్ సెక్టార్లో సర్క్యులర్ ఎకానమీ కోసం రోడ్మ్యాప్ అంశంపై తిరుపతి లో జరిగిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్టీల్ సెక్టార్లో సర్క్యులర్ ఎకానమీ కోసం రోడ్మ్యాప్ తయారీ, అమలు అంశాలపై స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కన్సల్టేటివ్ కమిటీ సమావేశం ఈరోజు తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి  రామచంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్ధాల నుంచి సంపదని సృష్టించడం ఎంతో ముఖ్యమని, పర్యావరణ హితంగా రీ సైక్లింగ్ ప్రక్రియలు జరగాలని అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్య లు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. స్క్రాప్ స్టీల్ ను రీసైకిల్ చేయడం ద్వారా ఉక్కును పునర్వినియోగించుకోవచ్చని మంత్రి అన్నారు. పర్యావరణ హితంగా రీసైకిల్ చేయగల విధానాలు, సాధ్యాసాధ్యా లపై ఆయన సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 30 MT ల స్టీల్ స్క్రాప్ వినియోగమౌతుండగా అందులో 5MTలు దిగుమతి చేసుకుంటన్నదని ఆయన తెలిపారు. 2047 కల్లా దేశ వ్యాప్తంగా స్టీల్ స్క్రాప్ డిమాండ్ 150 MTకు చేరనున్నట్లు మంత్రి వివరించారు. ఎక్కువ మెత్తంలో స్టీల్ స్క్రాప్ ను కలిగిఉండడం వల్ల దానిని సమర్థంగా పునర్వినియోగించుకోవడం ద్వారా ఉద్గార రహిత స్టీల్ ను తయారు చేసేందుకు తద్వారా స్టీల్ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పుడుతుందని మంత్రి తెలిపారు. ద్వితీయ శ్రేణి ఉక్కు పరిశ్రమలు 100 శాతం రీసైకిల్ చేసిన ఉక్కుని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆర్థిక, సామాజిక, పర్యవరణ హిత కారణాల వల్ల స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ కే మొగ్గు చూపుతున్నాయన్నారు.
సర్క్యులర్ ఎకానమీలో సహజ వనరుల వినియోగంతో తయారు చేసిన వస్తువు, దాని ఉపయోగకరమైన జీవితం ముగిసే వరకు చెలామణిలో ఉంటుందని, తదనంతరం మరొక రూపంలో పునఃరూపకల్పన, పునర్నిర్మితమౌతుందని అన్నారు. రీ సై క్లింగ్ కి సంబంధించి పునర్వినియోగించడం, రీసైకిల్ చేయడం, పునరుద్ధరించడం, రీడిజైన్ చేయడం, పునర్నిర్మించండి అనే ఆరు R సూత్రాల ఆధారంగా వాడుకలో ఉన్న వనరుల సామర్థ్యాన్ని పూర్తింగా ఉపయోగించుకోవడం ద్వారా సహజ వనరుల వెలికితీతను తగ్గించ వచ్చని మంత్రి తెలిపారు.

COP26 గ్లాస్గో సమ్మిట్లో, భారతదేశం 2030 నాటికి 1 బిలియన్ టన్నుల ఉద్గారాలు, కార్బన్ తీవ్రతను 45% కంటే తక్కువకు తగ్గించి, 2070 నాటికల్లా సున్నా కర్బన ఉద్గారాలు కు తీసుకు వస్తామని ప్రతిజ్ఞ చేసిందని మంత్రి గుర్తుచేశారు.
స్టీల్ రీసైక్లింగ్ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి వివరించారు. స్క్రాప్ ప్రమోషన్, వాటి కేంద్రాల ఏర్పాటు సులభతరం చేయడానికి 2019లోనే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ “స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీషని ఏర్పాటు చేసిందన్నారు. MSTC లిమిటెడ్, మహీంద్రా accelo లతో జాయింట్ వెంచర్ గా మూడు (3) అధీకృత వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇవి ఇప్పటికే నోయిడా (U.P.), చెన్నై మరియు పూణేలో పనిచేస్తున్నాయని, అదనంగా, ఇండోర్, అహ్మదాబాద్ హైదరాబాద్లో మూడు (3) అధీకృత వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు 2022-23లో స్థాపించనున్నట్లు తెలిపారు.
స్టీల్ ను లీనియర్ ఎకానమీ నుంచి సర్క్యులర్ ఎకానమీకి మార్చడానికి నీతి ఆయోగ్ 11 సెక్టార్ నిర్దిష్ట కమిటీలను ఏర్పాటు చేసిందనీ, NITI ఆయోగ్ ద్వారా స్క్రాప్ మెటల్ (ఫెర్రస్ & నాన్-ఫెర్రస్) లో సర్క్యులర్ ఎకానమీ కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసే బాధ్యత ఉక్కు మంత్రిత్వ శాఖకు అప్పగించడం జరిగిందని మంత్రి తెలిపారు. దీనిపై నివేదికను ఉక్కు మంత్రిత్వ శాఖ 2021 జూలైలో NITI ఆయోగ్కు సమర్పించిందని ఆయన వివరించారు.
కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) మోటారు వాహనాల (రిజిస్ట్రేషన్ మరియు వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీ యొక్క విధులు) నియమాలు 2021ను నోటిఫై చేసి అధీకృత వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా, వాహన యజమానులు వాహనాలను స్వచ్ఛందంగా సరెండర్ చేసి స్క్రాప్ చేయడానికి అవసరమైన ప్రోత్సాహక నిబంధనలు పొందుపరచడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ, గ్రామీణాభివృద్థి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ఖులస్తే, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ,  రుచికా ఛౌదరీ గోవిల్, కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు బిద్యుత్ బరన్ మెహతో లోక్ సభ ఎంపీ జంషెడ్పూర్ (జార్ఖండ్),  అఖిలేష్ ప్రసాద్ సింగ్, బీహార్, ఎంపీ రాజ్య సభ, చంద్ర ప్రకాష్ చౌధరీ లోక్ సభ ఎంపీ గిరిధ్ (జార్ఖండ్),  జనార్థన్ సింగ్ సిగిర్వాల్ లోక్ సభ ఎంపీ మహారాజ్ గంజ్ (బీహార్), సప్తగిరి శంకర్ ఉల్కా లోక్ సభ ఎంపీ కోరాపుట్ (ఒడిశా),  విజయ్ బాఘేల్, లోక్ సభ ఎంపీ దుర్గ్ (ఛత్తీస్గఢ్ ) లు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *