Breaking News

3వ తేదీన జనవాణి జనసేన భరోసా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు ముద్దనా స్టాలిన్ శంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  3వ తేదీన విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, తమ సమస్యలను వినతిపత్రం ద్వారా, అర్జీల ద్వారా  పవన్ కళ్యాణ్ కి నేరుగా అందించాలని, పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందించిన 24 గంటలు లోపే పవన్ కళ్యాణ్ పరిశీలించి సంబంధిత అధికారులకు అందజేసి, మీ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని సమస్య పరిష్కారం కాకపోతే జనసేన పార్టీ మీ సమస్యలు పై పోరాడుతుందని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత పేరుకే పధకాలు పెడుతూ వివిధ కారణాలతో లబ్దిదారులకు అందజేయడం లేదని . అలాగే గతంలో అనేక ముఖ్యమంత్రి లు ప్రజా సమస్యలు వినటానికి వేదికలు ఏర్పాటు చేసేవారు కానీ జగన్ రెడ్డి ప్రజా సమస్యలు వినకపోగా పరదాలు చాటున, బారికేడ్లు మాటున వచ్చిపోతున్నారని . అందుకే పవన్ కళ్యాణ్ జనవాణి, జనసేన భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు అనంతరం విజయవాడ నగర కార్యదర్శి కొరగంజి వెంకటరమణా  మాట్లాడుతూ విజయవాడ లో కొండ ప్రాంతం అధికంగా ఉందని కొండ ప్రాంతం పై నివసించే వాళ్లకి ఇళ్ల పట్టాలు లేవని శతాబ్ద కాలం ఇళ్ల పట్టాల సమస్య ఉందని, ఇల్లు మరమ్మత్తులు చేయించుకోవడానికి లోను పెట్టుటకు కూడా అర్హత లేదని, సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను పవన్ కళ్యాణ్  దృష్టికి తీసుకువెళ్తే సమస్య పరిష్కారం దిశగా ఆయన అడుగులు వేస్తారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి సభింకర్ నరేష్, ఐటీ వింగ్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముంతాపురం రాజేష్ పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *