పేదలకు పండగ కానుకగా టిడ్కో ఇల్లు

-బృహత్తర కార్యానికి ప్రభుత్వం శ్రీకారం
-డిసెంబర్ 2022 నాటికి లబ్దిదారులకు ఇళ్ళు పంపిణీ
-మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కి మర్యాదపూర్వకంగా కలిసిన టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్
-టిడ్కో ఇళ్ల పునఃనిర్మాణానికి చర్యలు వేగవంతం

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ.పీ టిడ్కో హౌసింగ్ కొర్పొరేషన్ చైర్మన్ మంగళవారం పలాస లోని టిడ్కో హౌసింగ్ కోలనీలో పర్యటించి పనులను పరిశీలించారు, పునఃనిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు అనంతరం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ని మర్యాదపూర్వకంగా కలిసి టిడ్కో హౌసింగ్ వివరాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం ద్వారా పలాస లో మొత్తంగా 912 కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని, ఇందులో 300 చదరపు గజాలు, 365 చదరపు గజాలు 430 చదరపు గజాలు విస్తీర్ణం గల మూడు విభాగాల ఇళ్ల ఉంటాయన్నారు, కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, వైసీపీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకటరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీవీ సతీష్, బల్ల శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *