Breaking News

సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక రవాణాశాఖ ఉద్యోగుల సంఘ భవనం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ నాయకులతో పాటుగా ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు సత్యనారాయణ, ఎ నాగరాజు, కె నాంచారయ్య, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటవ తారీఖున సీఎం ఇళ్ల ముట్టడి కార్యక్రమము పోస్టర్ను రవాణాశాఖ ఉద్యోగుల జోనల్ అధ్యక్షుడు యం. రాజూబాబు ఆవిష్కరించారు. రాజుబాబు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారన్న భావనతో ఉద్యోగులందరూ ఇప్పటివరకు ఎదురుచూస్తూ వచ్చారని, కానీ సంవత్సరాలు గడుస్తున్న కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసి ప్రజలను అండగా ఉంటుందని, అలాగే సీపీఎస్ ఉద్యోగులను కూడా ఆదుకునే విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలను కూడా ఆదుకోవాలన్నారు. ఇప్పటికే రాజస్థాన్, చాటిష్గుడ్ వంటి రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఆ బాటలోనే మన రాష్ట్రం కూడా సీపీఎస్ ను రద్దుచెయ్యలన్నారు. ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటో తారీఖున సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మా హక్కులను కాపాడుకునే విధంగా సిపిఎస్ రద్దు కొరకు చేస్తున్న ఆందోళనే తప్ప, ప్రభుత్వంనకు ఉద్యోగులుగా మేము ఎప్పుడు వ్యతిరేకలం కాదన్నారు. సెప్టెంబర్ ఒకటి లోపు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసే ప్రకటన చేస్తుందన్న ఆశాభావంతో ఉద్యోగులందరూ ఎదురుచూస్తున్నారన్నారు. ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం లేదని, ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ విధానం రద్దుపై సెప్టెంబరు ఒకటో తారీకు లోపు ఒక ప్రకటన చేయాలన్నారు. లేని పక్షంలో సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులతో సిపిఎస్ రద్దుపై పోస్టర్లను కూడా విడుదల చేయడం, సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ నాగరాజు, కృష్ణా జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కె నాంచారయ్య , సిటీ అధ్యక్షులు రవి, సతీష్ , రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 సంఘ నాయకులు కె వి వి నాగమురళి, ఎం ఆనంద్ కుమార్, బి చంద్రశేఖర్, మరియు ఉద్యోగులు ఉన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *