Breaking News

సమాజానికి సేవలు అందించడంలోనే నిజమైన తృప్తి… : శాసన మండలి సభ్యుడు మహ్మద్ రుహుల్లా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల కష్టాలను తమ కష్టాలు గా భావించి సేవలు అందించడంలోనే నిజమైన తృప్తి ఉంటుందని శాసన మండలి సభ్యులు మహ్మద్ రుహుల్లా అన్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ, డ్రీమ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా మదర్ తెరిసా 112వ జయంతి వేడుకలను హోటల్ ఐలాపురం లోని కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులైన 24 మంది సామాజిక సేవలు అందించిన సామాజిక వేత్తలకు మదర్ తెరిసా జాతీయ ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా మహ్మద్ రుహుల్లా మాట్లాడుతూ పేదరికం దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో నిస్వార్థంగా సామాజిక సేవలు అందిస్తున్న మానవతామూర్తులకు ఈ పురస్కారాలనివ్వడం అభినందనీయమన్నారు. ది అమెరికన్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ చాప్టర్ పీస్ అంబాసిడర్ డాక్టర్ అద్దంకి రాజా యోనా మాట్లాడుతూ కుష్టు రోగులు, వృద్దులు, అనాధలు, మహిళలకు సేవలు చేయడం చిన్నవిషయం కాదన్నారు. సామాజిక ఉద్యమ నేత, డ్రీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మేదర సురేష్ మాట్లాడుతూ ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుదనే ఉద్ధేశ్యం తోనే ఈ పురస్కారాలను ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మండలి సభ్యుని చేతులు మీదుగా జ్ఞాపిక, మెడల్, ప్రసంసాపత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 24 మంది పురస్కారాలను అందుకున్నారు. పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆకుమర్తి చిన్న, నెహ్రూ యువ కేంద్రం కోర్దినేటర్ వినోద్ కుమార్, ఈదా శామ్యూల్ రెడ్డి, షేక్ రసూల్, డాక్టర్ జల్లి విక్టర్, దొమ్మేటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *