Breaking News

ఉద్యోగులకు అండగా ఎన్జీవో సంఘం… : జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్

కంచికచర్ల, నవంబరు 3 :
గత 70 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉద్యోగుల శ్రేయస్సుకై అవిశ్రాంత పోరాటం చేసి, అనేక ప్రయోజనాలు, రాయితీలను సాధించిపెట్టిందని, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కరం కోసం నిరంతరం కృషి చెయ్యడం జరిగిందని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ అన్నారు.

స్థానిక బస్టాండ్ వెనుకగల ఏపీ ఎన్జీవో హోంనందు గురువారంనాడు ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అనేది రాష్ట్రంలో ఉద్యోగుల పక్షనే కాకుండ దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పక్షాన కూడా పోరాడి నిలిచిందని, అంతటి ప్రాధాన్యత కలిగిన సంఘం ఏపీ ఎన్ జీ ఓస్ సంఘమని ఆయన అన్నారు. దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకే తలపెట్టే ఏకార్యక్రమంలోనైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరుపున పాల్గొన్నాడం జరుగుతుందని, ఇంతటి ఉన్నతిగల చరిత్ర కలిగిన సంస్థ, మరొకటి లేదని విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉద్యోగుల శ్రేయస్సు పై నిరంతర పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు. కంచికచర్ల తాలూకా యూనిట్ సంఘ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ ప్రజాస్వామ్య యుతంగా పాల్గొని మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూకు పోటీచేసే హక్కు కూడా ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్ధ సభ్యులు కుడా ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లు పరిష్కరం కొరకు జిల్లా, రాష్ట్ర సంఘం తలపెట్టే కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించే విధంగా ఉండాలన్నారు. 2023లో వేతన సవరణ జరగవలసి ఉందని, కానీ ఇంతవరకు పాత వేతన సవరణలో పెండింగ్లో ఉన్న అనేక విషయాలను కూడా పరిష్కరించకుండ రాష్ట్ర ప్రభుత్వం చౌద్యం చేస్తుందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన డీఏలు జిపిఎఫ్ సరెండర్ లీవులు,ఇన్సూరెన్స్ బిల్లుల పెండింగ్ విషయాలపై ఉద్యోగులు జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్ బిల్లుల మంజూరు కాకపోవటం వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని పలువురు ఉద్యోగులు ప్రస్తావించారు. ఈ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ద్వారా పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికి సానుకూల స్పందన కనపడలేదన్నారు. దీనిపై ఉద్యోగులందరూ ఏకతాటిపై కార్యాచరణ చెయ్యాల్సిన అవసరం కూడా ఉందని ఆయన తెలిపారు.

జిల్లా కార్యదర్శి ఎండి ఇక్బాల్ మాట్లాడుతూ సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా సభ్యులను ఎన్నుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగులు లేవనెత్తిన అనేక స్థానిక సమస్యలను జిల్లా నాయకత్వం ద్వారా సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి వాటన్నిటినీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీఓస్ సంఘ మాసపత్రిక అయిన ఎన్జీవో సమాచారానికి అందరూ చందాదారులుగా చేరాలని, ఉద్యోగులతో రిటైర్డ్ ఉద్యోగులతో కూడా సంఘ నాయకులు చందాలు కట్టించి ఉద్యోగులకు సంబంధించిన సమాచారంను పత్రిక ద్వారా ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యం రాజుబాబు, మధుసూదన్ రావు, రాజశేఖర్, కంచికచర్ల తాలూకా యూనిట్ అధ్యక్షుడు కె వి శివారెడ్డి, కార్యదర్శి యం బిక్షాలు, కోశాధికారి నాగులు, సంఘ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *