విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థకు సంబంధించిన జోనల్ ఆఫీసులలో పట్టణ ప్రణాళిక సిబ్బంది `వారు శుక్రవారం ఫ్రై డే ఓపెన్ ఫోరం నిర్వహించినారు. సదరు ఓపెన్ ఫోరంలో సుమారు 12 మంది ప్రజలు పాల్గొని పట్టాణ ప్రణాళిక శాఖకు సంబంధించి తమ సమస్యలను తెలియచేసి తమ అనుమానములను నివృత్తి చేసుకొనినారు. కావున సదరు మూడు సర్కిల్స్ లో నిర్వహించిన మేళా నందు ఈ క్రింది అంశములకు గాను వచ్చిన దరఖాస్తుల వివరములు తెలియజేయటమైనది. మూడు సర్కిల్స్ నందు పై ఓపెన్ ఫోరం మేళ నందు దాఖలు పరచిన 2 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించబడుననియు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు మూడు సర్కిళ్ల నందు ఓపెన్ ఫోరం నిర్వహించబడునని అందరు లైసెన్సెడ్ సర్వేయర్ / లైసెన్సెడ్ టెక్నికల్ పర్సన్ /ఇంజనీర్ లకు మరియు ప్రజలకు తెలియచేయడమైనది. అంతే కాక సమస్యల పరిష్కరించు కొనుటకు గాను 3 సర్కిల్స్ నందు గల పట్టాణ ప్రణాళిక విభాగమునకు సంబంధించిన టి. పి. బి. ఒ / టి. పి. ఎస్ / టి. పి. ఒ లు మరియు అసిస్టెంట్ సిటి ప్లానర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్ల ద్వారా నిర్వహించబడునని తెలియజేయడమైనది.
Prajavartha Online Telugu News