-బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి లాయర్ బోనుజయమ్మ కి సన్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వందేమాతరం ఎక్కడికి వెలుతుంది ఈతరం, అనే ఆవేదనతో… ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హెూదా కోరుతూ…33% శాతం ఉమెన్స్ రిజర్వేషన్ నెరవేర్చమని డిమాండ్ తో గాంధిదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్టు అధ్యక్షులు నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నగరాజన్ ఢిల్లీలో తమ గళం వినిపించడానికి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తొలుత 43 వ డివిజనులో ఊర్మిలా నగర్ లోని గాంధిదేశం ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐతే స్వాతంత్ర్య భరత దేశంలో ఇప్పటికీ వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా మహిళా న్యాయమూర్తి కి అవకాశం రాకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ సుమారు 120 సంవత్సరాల చరిత్రలోనే ఏకైక మహిళా ప్రధాన కార్యదర్శి గా సేవలు అందించిన (మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి ) మహిళా లాయర్ బోను జయమ్మ ని ఘనంగా సన్మానించారు. తాను డిల్లీ కి ఎందుకు బయలుదేరి వెళుతున్నాడో విలేకరులకు వివరించారు.
కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనంకు మహాత్మ గాంధీ పేరు, బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్లు పెట్టి…. అలాగే వారి ఇద్దరి శిలా విగ్రహాలు పెట్టమని కోరుతున్నానన్నారు. పై ఇద్దరి పేరుతో రాజకీయాలు చేయకూడదు. ఇద్దరి సిద్ధాంతాలు మన భారతదేశమునకు దేశ ఎదుగుదలకు చాలా విభిన్నమైనది.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అమ్మా నాన్న లేని బిడ్డలు, అనాధలుగా ఉన్నట్లు ప్రస్తుతం ఆంధ్రుల పరిస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం పై
అందరు కలసి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హెూదా కల్పించి తద్వారా లభించే ఆర్థికపరమైన న్యాయం చేయండి.
వనరులు సకాలంలో అందించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నానని పార్లమెంటు సమావేశాలకు వస్తున్న అక్కడకు ఎమ్ పి లందరికి తాను వినతిపత్రం అందజేయడానికే ఈ ఢిల్లీ పాయనమన్నారు.
గాంధీగారు కలలు కన్న నిజమైన స్వాతంత్ర్యం “ఎప్పుడైతే స్త్రీ వంటినిండుగా బంగారపు ఆభరణాలతో రాత్రి 12 గంటలకు ఒంటరిగా నడవగలదో అప్పుడు అన్న మాటలు గుర్తించాలి. అప్పుడే అహింసాపాలనం పొందగలమని గాంధీ నగరాజన్ అన్నారు. “అహింసాపాలనం స్త్రీ వల్లనే సాధ్యం అన్న గాంధీగారి మాటలని గుర్తించాలి”. అందుకు 33% శాతం రిజర్వేషన్ పొందుట అవసరం. పైగా డా|| బి.ఆర్.అంబేద్కర్ హిందు కోడ్ బిల్ లోని ముఖ్యఅంశం. ఆడపడుచులకు, పురుషులకు సమానమైన హక్కులు గురించి ఆయన ఆలోచనలను గురించి గుర్తించాలన్నారు.
75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఒకే ఒక స్త్రీ ఇంతవరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చూడ లేకపోవుట అది చూడాలని అది మన దేశ ఎదుగుదల ఇది కూడ ప్రధానమైన కోరికగా భావిస్తున్నాను. ఇక ఈ ఇద్దరి మహా నాయకుల పేర్లతో ప్రజలను విభజించి పాలించుటకు ముగింపు పలికి భావితరాల భవిష్యత్తుకు
న్యాయం చేకూర్చి మన దేశ ఐక్యమత్యం ప్రపంచదేశాలు గర్వించే విధముగా బలమైన రాజభవనాన్ని నిర్మిస్తూ మరలా మన రాజ్యాంగ ఘనతను అన్ని దేశాలు గర్వించువిధంగా చాటిచెపుదామన్నారు. గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్టు తరుపున తన ఆవేదనలను ప్రధానమంత్రి నుండి ఉన్న యం.పి. ల వరకు పార్లమెంటులో
వివాదించనున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి,కేంద్ర మంత్రులు అందరికీ, లోక్ సభ,రాజ్యసభ, సబ్యులకు తాను స్వయంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, మహిళలుకు 33 శాతం రిజర్వేషన్లు, అంశంపై అందరికీ వినతిపత్రం అందజేయనున్నట్టుగా ప్రకటించారు. కాగా తనకు సరైన స్తానం కల్పించి. బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి హోదాలో తనను ఘనంగా సన్మానించిన గాంధీ నగరాజన్ కి బోను జయమ్మ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో గాంధీ నగరాజన్ తో పాటుగా బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి బోను జయమ్మ, గాంధీ ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్ ఆర్ శివరంజని, ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షురాలు భాపతి భారతి తదితరులు పాల్గొన్నారు.