Breaking News

విద్యార్థి దశ నుండే వినియోగదారుల హక్కుల పై అవగాహన కలిగివుండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశ నుండే వినియోగదారుల హక్కుల పై అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం యూత్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 100 రోజుల అవగాహన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినియోగదార్ల హక్కులపై అవగాహన కల్పించుకోవడం ద్వారా తమను తాము రక్షించుకోగలరు అన్నారు. ప్రస్తుతం ఈ` కామర్స్‌ వ్యాపారంలో వినియోగదారులు నష్టపోకుండా యువతలో చైతన్యం రావాలన్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు యూత్‌ ఎంగేజ్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు ఎస్‌ రామలక్ష్మి, ఖతిఫ్‌ కౌసర్‌ బానో, డిఎస్‌వో పి. కోమలిపద్మ, యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ యం శ్రీనివాస్‌రావు, యూత్‌ ఎంగేజ్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎండి బాజీ, జిల్లా యువజన సమన్వయ కర్త మధులత, యువజన న్యాయవాది నవ్య, రమ్య, గోపిక ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *