-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి విజయవాడ తూర్పు నియోజకవర్గం లో 08-12-2022 తేదిన నిర్వహించబోవు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనలు చేయాడానికి రాష్ట్రపురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ విచ్చేయుచ్చున్న సందర్భంగా 18, 15, 16, 14, 3, 2, 5, 6, మరియు 7 డివిజన్లలో పర్యవేక్షించి ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనల కార్యక్రమాల ఏర్పాట్ల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవములు జరుగు ప్రదేశములలో రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేసించినారు. రాష్ట్రపురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ సందర్శించే రహాదారులు, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, జోనల్ కమిషనర్-3 డా. ఏ.రవిచంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.