Breaking News

ఈనెల 12 నుంచి రత్నాకర్ దర్శకత్వంలో వీడియో ఆల్బమ్ షూటింగ్ ప్రారంభం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
దర్శకుడు రత్నాకర్ కనపర్తి దర్శకత్వం లో నా నావలో అనే క్రిస్మస్ ప్రత్యేక వీడియో ఆల్బమ్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆల్బమ్ నిర్మాణ సంస్థ జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో స్థానిక సరళనగరలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నా నావలో ఆల్బలం సంభందించిన ప్రచార పోస్టర్స్ ను అమిరినేని వెంకట్ ప్రసాద్ ఆవిష్కరించారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ గతం లో జోవెన్ బ్యానర్ లో, నీల కోటేశ్వరరావు నిర్మాతగా హృదయతార వీడియో ఆల్బలం ను రూపొందించామని. రానున్న క్రిస్మస్ సందర్భంగా మరో ఆల్బమ్ ”నా నావలో ”అనే పేరుతో రూపొందిస్తున్నామన్నారు. ప్రొఫెసర్ సుధాకర్ రచించిన పాటకు శ్రీపతి రాముడు సంగీత దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ గానం చేశారన్నారు. ఇందులో మాస్టర్ జోయల్ సుధాకర్ తో పాటు స్థానిక కళా కారులతో షూటింగ్ జరుగుతుందన్నారు. అమ్మ సుధీర్ గోగినేని, కొండ్రు కిరణ్ లు నృత్య దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. చీరాల, నిజాంపట్నం సముద్ర తీరం లో షూటింగ్ ఈ నెల 12 నుంచి జరుగుతుందన్నారు. సమావేశం లో డి.ఓ.పి లు కొమరాబత్తుని నాగరాజు, దేవరపల్లి మధు, ప్రొడక్షన్ ఇంచార్జ్ మధుకర్, లైన్ ప్రొడ్యూసర్ మునిపల్లి శ్రీకాంత్, కో డైరెక్టర్ ఎస్.ఎస్.వి. శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *