Breaking News

రోటరీ మిడ్ టౌన్ వారి సౌజన్యంతో ఉచిత దంత పరీక్షలు

-స్వర సూపర్ స్పెషాలిటీలో పోస్టర్ ఆవిష్కరణ
-పాల్గొన్న రోటరీ మిడ్ టౌన్ ప్రతినిధులు, డాక్టర్ల బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
50 సంవత్సరాలు పైబడినవారందరికీ రోటరీ మిడ్ టౌన్ వారి సౌజన్యంతో ప్రతి గురువారం ఉదయం 9 గం.ల నుండి సా. 5 గం.ల వరకు 2023 జూన్ నెలాఖరు వరకు బి.ఆర్.టి.ఎస్. రోడ్లోని స్వర సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నందు ఉచిత దంత పరీక్షల సౌకర్యం కలగజేస్తున్నట్లు రోటరీ మి డ్ టౌన్ అధ్యక్షులు మాగంటి కృష్ణ ప్రభు పేర్కొన్నారు. నేడు జరిగిన కార్యక్రమంలో దంతాల పట్ల తీ సుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంలో పోస్టర్ను విడుదల చేశారు. ఈ S కార్యక్రమంలో స్వర సూపర్ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జి. అ వినాష్, హాస్పిటల్ సిఈవో డాక్టర్ వి. వెంకట్, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.వి. కృష్ణ చై తన్య తదితరులు పాల్గొన్నారు. హెల్తీ టీత్… హ్యాపీ స్మైల్స్ నినాదంతో ప్రజలందరికీ అవగాహన కల్పిం చడం, అందరికీ ఆధునిక దంత వైద్య చికిత్సలు అందించడం ప్రధాన కర్తవ్యంగా తెలిపారు. దంత వై ద్య నిపుణులు ఎస్.వి. కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు అతి తక్కువ రేడియేషన్ క ల డిజిటల్ ఎక్స్రే, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం కారుట, గార పట్టిన పళ్ళు, గుట్కా, రంగు మారిన పళ్ళకు ఆల్ట్రా సోనిక్ స్కేలింగ్ మరియు బ్లీచింగ్ చికిత్సలు, అత్యాధునిక పద్ధతిలో రూట్ కెనా ల్, ఎత్తు వంకర పళ్ళకు చికిత్సలు, చిన్న పిల్లలలో దంత వైద్య చికిత్సలు, పళ్ళు లేని వారికి ఇంప్లాం ట్స్, జిర్కోనియా, సిరామిక్తో ఫిక్స్డ్ పళ్ళు, ఆటోక్లేవ్, యువి కేబినెట్, కెమికల్ క్లీనింగ్, 100% స్టెరిలై జేషన్, చిగుళ్ళ వ్యాధులకు లేజర్ చికిత్సలతో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలపారు. ఈ వై ద్య సేవలు 50 సంవత్సరాలు పైబడిన వారందరికి ప్రతి గురువారం ఉచిత ఓపి సౌకర్యం తన వంతు సహాయార్ధం అందిస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ 83414 43577, 95318 27999 నెంబర్లనందు సంప్రదించగలరని తెలిపారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *